Advertisement
Google Ads BL

‘సెవెన్’ విడుదలకు లైన్ క్లియర్


హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన సినిమా ‘సెవెన్’. తనకు సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం ఇస్తానని రమేష్ వర్మ డబ్బులు తీసుకున్నారని... సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం ఇవ్వలేదని, డబ్బులూ వెనక్కి తిరిగి ఇవ్వలేదని ఎన్నారై కిరణ్ కె. తలశిల కోర్టులో పిటిషన్ వేయడంతో, సినిమా విడుదలపై మంగళవారం హైదరాబాద్ సివిల్ కోర్టు స్టే ఇచ్చింది.

Advertisement
CJ Advs

కోర్టు వెలుపల కిరణ్ తలశిలతో ‘సెవెన్’ నిర్మాత రమేష్ వర్మ సమస్యను పరిష్కరించుకున్నారు. దాంతో సినిమా విడుదలపై తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని కిరణ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేయడంతో ‘సెవెన్’ విడుదలకు లైన్ క్లియర్ అయింది. నిజార్ షఫీ దర్శకత్వంలో హవీష్ హీరోగా, రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమా ఈ రోజు (బుధవారం) పెయిడ్ ప్రీమియర్ షోలతో సినిమా విడుదలవుతోంది. గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Line Clear To Seven Movie Release:

Seven Movie controversy Ended
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs