Advertisement
Google Ads BL

‘శివరంజని’ స్పెషల్‌పై మారుతి హ్యాండ్


సక్సెస్ పుల్ డైరెక్టర్  మారుతి చేతుల మీదుగా శివరంజని సినిమాలో స్పెషల్ సాంగ్  ‘పాప్ కార్న్’ విడుదల

Advertisement
CJ Advs

ఆకట్టుకునే కంటెంట్ ఉంటే హారర్ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ తగ్గదని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నిరూపిస్తూనే ఉన్నారు. అలాంటి కంటెంట్‌తో వస్తోన్న చిత్రమే ‘శివరంజని’. హాట్ బ్యూటీ రష్మి గౌతమ్, నందు జంటగా.. నందినిరాయ్ మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలోని ఒక హాట్ సాంగ్ ‘పాప్ కార్న్’ అనే సాంగ్‌ను సక్సెస్‌పుల్ డైరెక్టర్ మారుతి విడుదల చేసారు. 

ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘‘ఇంతకు ముందు ‘శివరంజని’ ట్రైలర్ చూసాను. చాలా బాగుంది. హారర్ బ్యాక్‌డ్రాప్ అనగానే తక్కువ బడ్జెట్ సినిమా అనుకుంటారు. కానీ ఈ సినిమా చాలా రిచ్‌గా తీసారు అనిపించింది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకపోవడం నాకు నచ్చింది. నిర్మాత పద్మనాభరెడ్డిగారు సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత. చిన్న సినిమాలకు ఆయన అందిస్తున్న సహాకారం చాలా పెద్దది. ఆయనకు ఈ సినిమా మంచి పేరుతో పాటు లాభాల్ని తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను లాంచ్ చేసిన పాప్ కార్న్ పాట కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ‘శివరంజని’ సక్సెస్‌ఫుల్ చిత్రం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.

దర్శకుడు నాగప్రభాకరన్ చిత్ర కంటెంట్‌ను గురించి తెలియజేస్తూ.. ‘‘హారర్ చిత్రాలు అనగానే మనకు గుర్తొచ్చే అంశాలకు భిన్నంగా కనిపించే కథ ఇది. స్ర్కీన్‌ప్లే బేసెడ్‌గా ఈ కథ నడుస్తుంది. రష్మి క్యారెక్టర్‌లోని వేరియేషన్స్ తప్పకుండా ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తాయి. ఊహించని కథ, కథనాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. నిర్మాత పద్మనాభరెడ్డిగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను రూపొందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలో సెన్సార్‌కు వెళ్లనున్నాం. అలాగే మేం అడగ్గానే వచ్చి మా సినిమా‌లోని స్పెషల్ సాంగ్‌ని విడుదల చేసిన మారుతిగారికి కృతజ్ఞతలు’’ అన్నారు.

నిర్మాత పద్మనాభ‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘దర్శకులు మారుతి చేతుల మీదుగా మా సినిమా స్పెషల్ సాంగ్ రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. హారర్ సినిమాలలో శివరంజని విభిన్నంగా ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందనే నమ్మకం మాకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయింది. త్వరలోనే సెన్సారుకు వెళుతుంది. ఈ నెలలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం..’’ అన్నారు.

మరో నిర్మాత నల్లా అయ్యన్ననాయుడు, సహానిర్మాత కటకం వాసు మాట్లాడుతూ.. ‘‘యు అండ్ ఐ బ్యానర్‌లో వస్తున్న శివరంజని మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం మాకుంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌ని లాంచ్ చేసిన మారుతిగారికి ప్రత్యేక ధన్యవాదాలు. జూన్ నెలలో గ్రాండ్ రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

Maruthi Releases Sivaranjani Special Song:

Sivaranjani Pop Corn Song Launched by Director Maruthi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs