Advertisement
Google Ads BL

సాయిపల్లవి ఇకపై ఆ తప్పు చేయదట!


ఆమె పేరు వింటే కొన్నాళ్లకిందట అందరు పులకించిపోయేవారు. పెద్దగా మేకప్‌ లేకుండా, సాదాసీదా అమ్మాయిలా మొహంపై మొటిమలతో దానినే తన సెక్స్‌ సింబల్‌గా మార్చుకుంది సాయిపల్లవి. గ్లామర్‌ షోకి నో చెబుతూ, ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తానంటూ వచ్చింది. అయినా మనవారు ఆమెని బాగా ఆదరించారు. మలయాళ ‘ప్రేమమ్‌’, తెలుగులో చేసిన మొదటి చిత్రం ‘ఫిదా’లో భానుమతి పాత్రలో అదరగొట్టింది. ఇంకేముంది టాలీవుడ్‌ మొత్తం భానుమతి మేనియాలో పడిపోయింది. 

Advertisement
CJ Advs

కానీ ఆ తర్వాత ఈ రెండు చిత్రాలు తప్ప ఆమెకి మరో చిత్రంతో హిట్‌ రాలేదు. ‘కణం, పడి పడిలేచె మనసు’ చిత్రాలు డిజాస్టర్‌ అయ్యాయి. అయినా ‘పడి పడి లేచె మనసు’ చిత్రం ఫ్లాప్‌ కావడంతో తనకి రావాల్సిన 25లక్షల పెండింగ్‌ ఎమౌంట్‌ని తీసుకోకుండా నిర్మాతను ఆదుకుంది. మారి2లో రౌడీబేబీ పాట మినహా ఆ చిత్రం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. ఇక మలయాళంలో ఓ చిత్రం చేస్తే అది కూడా తుస్సుమంది. కానీ తాజాగా విడుదలైన సూర్య-సెల్వరాఘవన్‌ల ‘ఎన్జీకే’లో ఆమె చేసిన పాత్రను మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సాధారణ అనుమానపు గృహిణి పాత్రలో ఆమె పాత్రకు సరైన ప్రాధాన్యం లేదు సరికదా.. నటన కూడా తీసికట్టు అనే విధంగా ఉంది. గ్లామర్‌పరంగా గ్లో మిస్సయింది. దీంతో విమర్శకులు ఈమెపై పడ్డారు. అయితే ఇది స్క్రిప్ట్‌ పూర్తిగా చూసి చేసిన సినిమా కాదని, ఇకపై ఇలాంటి పొరపాట్లు లేకుండా చూసుకుంటానని మాట ఇస్తోంది. 

ప్రస్తుతం ఆమె చేతిలో వేణు ఉదుగుల తీసే చిత్రం మాత్రం ఉంది. రానా హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం పొలిటికల్‌ థ్రిల్లర్‌ జోన్‌లో రూపొందుతోంది. తన మాయ ప్రియా వారియర్‌లా మూడు నాళ్ల ముచ్చట కాకూడదన భావిస్తే ఇకపై ఆమె ఆచితూచి పాత్రల ప్రాధాన్యం దృష్టిలో పెట్టుకుని సినిమాలను ఎంపిక చేసుకోవాలి. లేకపోతే ఆమె వన్‌ మూవీ వండర్‌గా మిగలడం ఖాయమనే చెప్పాలి.

Sai Pallavi Reaction on NGK Result:

Sai Pallavi Feel Bad with NGK Result
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs