Advertisement
Google Ads BL

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్‌!


బాహబలి తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న హాలీవుడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా సాహో రూపొందుతోంది. దాదాపు 250కోట్లకి పైగా బడ్జెట్‌తో రూపొందుతూ... టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లను టార్గెట్‌ చేస్తూ ప్యాన్‌ ఇండియా మూవీగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు15న విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక ప్రమోషన్స్‌ షురూ చేసే సమయంలో ఈ ప్రాజెక్ట్‌ నుంచి సంగీత దర్శకత్రయం శంకర్-ఎహసాన్‌-లాయ్‌లు తప్పుకున్నారు. మరి ఆ స్థానంలో ఎవరు సంగీతం అందించనున్నారు? అనే విషయంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. 

Advertisement
CJ Advs

థమన్, జీబ్రాన్‌ల పేర్లు బయటకు వచ్చాయి. బాలీవుడ్‌ని కూడా టార్గెట్‌ చేస్తున్నారు కాబట్టి ఈ సంగీత దర్శకులు హఠాత్తుగా తప్పుకోవడం మైనసే అవుతుంది. అదే జిబ్రాన్‌ అయితే కోలీవుఢ్‌లో మరింత అంచనాలు పెరుగుతాయి. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లను టార్గెట్‌ చేసే ఉద్దేశ్యంతోనే ఈ మూడు భాషల వారినే నటీనటులుగా ఎంచుకున్నారు. 

ఇక ఈ చిత్రం టీజర్‌ని రంజాన్‌ కానుకగా విడుదల చేసి సల్మాన్‌ నటిస్తూ 5వ తేదీన విడుదల కానున్నభారత్‌ విడుదల అయ్యే థియేటర్లలో ప్రదర్శించనున్నారు. కొన్ని సెకన్ల పాటు ఉండే టీజర్‌ కోసం ఏకంగా 15లక్షలు ఖర్చు చేసి ఓ అద్భుతమైన హాలీవుడ్‌ మ్యూజికల్‌ బైట్‌ ని రాయల్టీ కిందకు తీసుకున్నారట. ఎందుకంటే ఫస్ట్‌ ఇంప్రెషన్‌ ఈజ్‌ ది బెస్ట్‌ ఇంప్రెషన్‌ కోసం ఇలా చేయనున్నారు. ఇక ఈ టీజర్‌ విడుదల తర్వాత ఈ చిత్రం రేంజ్‌, బిజినెస్‌ పీక్స్‌కి వెళ్లడం గ్యారంటీ అనే చెప్పాలి. 

Saaho Teaser on June 5:

Saaho Teaser Costs a Bomb!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs