మనస్టార్స్ సినిమాలు పూర్తి అయిన వెంటనే, లేదా వారి చిత్రాలు విడుదలై ప్రమోషన్స్ ముగిసిన తర్వాత ఫ్యామలీలతో విదేశాలకు వెకేషన్స్‌కి వెళ్తుంటారు. ముఖ్యంగా ఎండలు భగ్గుమంటున్న సమయంలో దాని నుంచి సేదతీరేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇక విషయానికి వస్తే ఇప్పటికే మహేష్ ఫ్యామిలీ, రామ్‌చరణ్ ఫ్యామిలీలు వెకేషన్స్‌లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. తాజాగా రౌడీస్టార్ విజయ్‌దేవరకొండ కూడా తన తమ్ముడు అమ్మానాన్న, నిర్మాత యష్ రంగినేనితో దక్షిణ ఫ్రాన్స్‌ని వెకేషన్స్‌కి వెళ్లాడు. ఇటీవల విజయ్ అలుపన్నది లేకుండా వరస చిత్రాలు చేస్తున్నాడు. దాంతో కాస్త రిలాక్స్ అవ్వడం కోసం ఆయన ఈ ట్రిప్‌ని ప్లాన్ చేశాడు. ఈ సందర్భంగా వారందరు కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు.
ఇక యష్ రంగినేని, విజయ్‌కి అంకుల్ అన్న విషయం తెలిసిందే. ఈ ట్రిప్‌కి సంబంధించిన ఫొటోలను యష్ రంగినేని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, రౌడీ అబ్బాయిలు.. రౌడీ అమ్మాయిలు.... సౌత్ ఫ్రాన్స్‌లో ఓ చోట ఫ్యామిలీ హాలీడేలో ఉన్నారు అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫొటోలలో రౌడీస్టార్ విజయ్ దేవరకొండ యమా స్టైలిష్‌గా ఉన్నాడు. ఇక విజయ్ గీతగోవిందం తర్వాత మరోసారి రష్మికా మందన్నతో మైత్రి మూవీ మేకర్స్ బేనర్‌లో డియర్‌కామ్రేడ్ చిత్రం చేస్తున్నాడు. దీనిని జూలై 26న విడుదల చేయనున్నారని సమాచారం.
ఇక ఈయన క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కె..యస్.రామారావు నిర్మాతగా ఓ మూవీ చేస్తున్నాడు. దీనికి బ్రేకప్ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. ఆనంద్ అన్నామలై అనే తమిళ దర్శనితో హీరో చిత్రం చేస్తున్నాడు. ఈ మూడు చిత్రాలు పూర్తయ్యేలోపు తన బేనర్‌ని కూడా ఇందులో భాగస్వామిని చేయనున్నాడు. ఇకపై ఆయన చిత్రాలన్నీ దక్షిణాది అన్ని భాషల్లో విడుదల కానుండటం విశేషం. అతి తక్కువ చిత్రాలతో ఈ రేంజ్‌కి ఎదిగిన అతి తక్కువ స్టార్స్‌లో విజయ్‌దేవరకొండ ఒకరు. ఇక ఈయన సోదరుడు ఆనంద్ దేవరకొండ, రాజశేఖర్ జీవితాల కుమార్తె శివాత్మికలు తెరంగేట్రం చేస్తోన్న ‘దొరసాని’ చిత్రం త్వరలో విడుదల కానుంది. మరి వచ్చే సమ్మర్ వెకేషన్స్‌కైనా విజయ్ పెళ్లిచేసుకుని, తన భార్యతో వెకేషన్స్‌కి వెళ్తాడేమో చూడాలి.....!