Advertisement
Google Ads BL

మారుతి-సాయితేజ్.. టైటిల్ ఇదేనా?


మెగా మేనల్లుడిని గాడిన పడేయాలని చిరంజీవి కంకణం కట్టుకున్నాడనీ న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. డబుల్ హ్యాట్రిక్ ప్లాప్స్ తరవాత చిత్రలహరి అనే సాఫ్ట్ అండ్ క్లాసిక్ టైటిల్‌తో యావరేజ్ హిట్ అందుకున్న సాయి తేజ్ కెరీర్ ని నిలబెట్టే బాధ్యతను చిరు తీసుకున్నాడని.. అందుకే మారుతీ దర్శకత్వంలో సాయి తేజ్ చెయ్యబోయే కథను చిరు ఫైనల్ చేసే వరకు వారి కాంబో మూవీ పట్టాలెక్కలేదని.. సాయి తేజ్ - మారుతీ కాంబో మూవీ స్క్రిప్ట్ ని చిరు తో పాటుగా అల్లు అరవింద్ కూడా చూసి ఓకే చేసాడని.. అందుకే ఆ సినిమా ఇప్పుడు అన్ని ఓకే అయ్యి పట్టాలెక్కడానికి సిద్దమైయిందనే న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.

Advertisement
CJ Advs

దర్శకుడు మారుతీ ఎప్పటిలాగే కామెడీ ఎంటెర్టైనర్‌గా ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడని.. సాయి తేజ్‌కి సరిపోయే కథను మారుతీ సిద్ధం చేసాడని అంటున్నారు. త్వరలోనే మొదలు కాబోయే ఈ సినిమాకి టైటిల్ గా ఓ ఆసక్తికర టైటిల్ ప్రచారంలోకొచ్చింది. మారుతీ - సాయి తేజ్ కాంబో తెరకెక్కబోయే సినిమా టైటిల్ భోగి అంటూ ప్రచారం మొదలైంది. మరి ‘భోగి’ అనే టైటిల్ తో సినిమాని తెరకెక్కించి..వచ్చే సంక్రాంతి బరిలో నిలిపితే... పండక్కి భోగి టైటిల్ కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని.. అందుకే మారుతీ తో పాటుగా సాయి కూడా అదే టైటిల్ కి మొగ్గు చూపుతున్నట్లుగా ఫిలింనగర్ టాక్. అయితే ఇందులో నిజమెంతుందో అనేది చిత్ర బృందం స్పందిస్తే గాని తెలియదు. ఇక ఈ సినిమాలో సాయి తేజ్ పక్కన హీరోయిన్‌గా ఎవ్వరిని ఫైనల్ చెయ్యలేదు.

Maruthi and Sai Dharam Tej Combo Film Confirmed:

Bhogi is the Title for Maruthi and Sai Dharam Tej  film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs