Advertisement
Google Ads BL

మీ అంతు చూస్తా: ఫలక్‌నుమా దాస్ వార్నింగ్!


అర్జున్‌రెడ్డి సినిమాతో విజయ దేవరకొండ స్టార్ హీరో అయ్యాడు. ఆ సినిమాలో యూత్ కి కనెక్ట్ అయ్యే బూతు డైలాగ్స్, రొమాంటిక్ అండ్ లిప్ లాక్స్ తో విజయ్ దేవరకొండకి భారీగా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అప్పటినుండి విజయ్ కి ఎదురు లేకుండా పోయింది. ఆ సినిమా తర్వాత చాలామంది హీరోలు తమ తమ సినిమాల్లో బూతులు మాట్లాడుతూ రొమాంటిక్ గా రెచ్చిపోయినా... పెద్దగా వారు ఫోకస్ కాలేకపోయారు కానీ.. తాజాగా ఫలక్‌నుమా దాస్ హీరో విశ్వక్ సేన్ మాత్రం వార్తల్లో నిలిచాడు. మందు, మగువ, బూతు అంటూ ఫలక్‌నుమా దాస్‌తో బాగా ఫేమస్ అయిన విశ్వక్ సేన్ ఇప్పుడు అర్జున్‌రెడ్డిలో విజయ్ దేవరకొండలా ఊహించుకుంటున్నట్లుగా కనబడుతుంది ఆ హీరో వ్యవహారం. 

Advertisement
CJ Advs

విశ్వక్ సేన్ తన సినిమా తోపు అంటూ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నాడు. ఫలక్‌నుమా దాస్ సినిమాకి ప్రమోషన్స్ కారణంగా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ పడ్డాయి. కానీ సినిమాలో బూతులు, మందు లాంటివి తప్ప స్పెషల్ గా ఏం లేకపోయేసరికి సినిమా కలెక్షన్స్ తగ్గాయి. అయితే విశ్వక్ సేన్ మాత్రం తన సినిమా సూపర్ అంటూ... ప్రమోట్ చేసుకుంటూ కాస్త ఎక్కువగానే మాట్లాడుతున్నాడు. ఇక విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఇప్పుడు విశ్వక్ సేన్ ఫలక్‌నుమా దాస్‌ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. 

ఫలక్‌నుమా దాస్ సినిమా పరమ చెత్తగా ఉందని విజయ్ ఫ్యాన్స్ ఆ సినిమాని ట్రోల్ చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ చేసే పనికి తన సినిమా కలెక్షన్స్ తగ్గుతాయన్న విశ్వక్ సేన్.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి వార్నింగ్ ఇస్తున్నాడు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వలన తన సినిమా ఫలక్‌నుమా దాస్ సినిమాకి డ్యామేజ్ జరిగితే మీ అంతు చూస్తానంటూ.. విజయ్ ఫ్యాన్స్‌కి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు విశ్వక్ సేన్.

Vishwak Sen Warning to Vijay Deverakonda Fans:

Arjun Reddy Fans Vs Falaknuma Das
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs