Advertisement
Google Ads BL

అడివి శేష్‌, పివిపి సినిమా టైటిల్ ఇదే..!


అడివి శేష్‌, పివిపి సినిమా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ ‘ఎవ‌రు’... ఆగ‌స్ట్ 23న విడుద‌ల‌

Advertisement
CJ Advs

‘క్ష‌ణం’ సినిమా ఎంత పెద్ద స‌క్సెస్‌ను సాధించిందో అంద‌రికీ తెలుసు. లిమిటెడ్ బడ్జెట్‌లో రూపొందించిన ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. ఇటు ప్రేక్ష‌కులు, అటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంది. ఇప్పుడు మ‌రోసారి పివిపి సినిమా, హీరో అడివి శేష్ కాంబినేష‌న్‌లో ఓ థ్రిల్ల‌ర్ చిత్రం రూపొందుతోంది. ఆ చిత్రానికి ‘ఎవ‌రు’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను ఈద్ సందర్భంగా విడుద‌ల చేశారు. 

వెంక‌ట్ రామ్ జీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాత‌లు. క్ష‌ణం, గూఢ‌చారి సినిమాలతో సూప‌ర్‌డూప‌ర్ హిట్స్‌ను సాధించిన అడివిశేష్ హీరోగా న‌టిస్తుండ‌గా, రెజీనా క‌సండ్ర హీరోయిన్‌గా న‌టిస్తుంది. న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ చిత్రానికి వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఆగ‌స్ట్ 23న విడుద‌ల చేస్తున్నారు. 

న‌టీన‌టులు:

అడివిశేష్‌, రెజీనా కసండ్ర‌, న‌వీన్ చంద్ర‌

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: వెంక‌ట్ రామ్‌జీ, నిర్మాత‌లు: పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, సినిమాటోగ్ర‌ఫీ: వ‌ంశీ ప‌చ్చిపులుసు, సంగీతం: శ్రీ చ‌ర‌ణ్ పాకాల‌, ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌, ఎడిటింగ్‌: గ్యారీ బి.హెచ్‌, డైలాగ్స్‌: అబ్బూరి ర‌వి, కాస్ట్యూమ్స్‌: జాహ్న‌వి ఎల్లోర్‌, సురా రెడ్డి, సౌండ్ ఎఫెక్ట్స్‌: య‌తిరాజ్‌, పి.ఆర్‌.ఓ: కాకా.

Adivi Sesh is back with Evaru:

<span>Actor Adivi Sesh and PVP Banner Movie Title Confirmed</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs