Advertisement
Google Ads BL

రంజాన్‌కి ఇదొక్కటేనా..? ఇంకేమైనా ఉన్నాయా?


బాహుబలి రెండు భాగాలు ఓ సంచలనం. ముఖ్యంగా రెండో పార్ట్‌గా వచ్చిన బాహుబలి-ది కన్‌క్లూజన్‌ సృష్టించిన ప్రభంజనాన్ని ఎన్నో చిత్రాలు టార్గెట్‌ చేసి విఫలమయ్యాయి. చైనా మార్కెట్‌ పుణ్యమా అని అమీర్‌ఖాన్‌ దంగల్‌ మాత్రమే ఆ ఫీట్‌ని సాధించగలిగింది. ఇక మాది మరో బాహుబలి అని ప్రచారం చేసిన చిత్రాలకు దిక్కుమొక్కు లేకుండా పోయింది. ఇక ప్రతి రంజాన్‌కి వచ్చే సల్మాన్‌ఖాన్‌ భారత్‌ ప్రమోషన్లలో కూడా బాహుబలి ప్రస్తావన తేవడం లేదు. బాహుబలితో నేషనల్‌ ఐకాన్‌గా, ఇండియన్‌ నయా స్టార్‌గా ప్రభాస్‌ ఎదిగాడు. ఆయనకు నేడు ఉత్తరాదిలో ఉన్న గుర్తింపు మామూలుగా లేదు. గత ఎన్నికల్లోనే కాదు. తాజా ఎన్నికల్లో కూడా బాహుబలి ప్రస్తావన తెచ్చిన రాజకీయ పార్టీలు, వాటి ప్రకటనలు అందరినీ నిశ్చేష్టులను చేస్తున్నాయి. 

Advertisement
CJ Advs

ఇక దక్షిణాదిలోనే కాదు.. ఉత్తరాదిలో కూడా ఈద్‌కి ఉన్న ప్రాధాన్యం తెలిసిందే. అదే రంజాన్‌కి తన చిత్రం టీజర్‌ని విడుదల చేయాలని ప్రభాస్‌ భావిస్తున్నాడట. ప్రభాస్‌ బాహుబలి తర్వాత చేస్తున్న చిత్రం ‘సాహో’. ఈ చిత్రం ఆగష్టు15న విడుదల కానుంది. ఈ చిత్రానికి దరిదాపుల్లో లేకుండా మిగిలిన చిత్రాలు వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ బాలీవుడ్‌లో ఓ రెండు చిత్రాలు, తమిళంలో ఓ చిత్రం మేము వస్తాం అంటున్నారు. అలాంటి వారి ఆలోచన ధోరణి మార్చాలంటే ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో’ అంటూ విడుదల చేసిన రెండు మేకింగ్‌ వీడియోలు పనికిరావు. అందుకే రంజాన్‌రోజున  ‘సాహో’ టీజర్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ మూవీని టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లలో ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. అందుకే శ్రద్దాకపూర్‌తో పాటు ఈ మూడు భాషల నటీనటులను సాంకేతిక నిపుణులనే ఎక్కువగా ఎంచుకున్నారు. మరి సాహో సృష్టించే ప్రభంజనాలు ‘భారత్‌ని తాకుతాయో లేదో చూడాలి...! మరి రంజాన్‌కి  ‘సాహో’ ఒక్కటేనా.? సైరా వంటి చిత్రాలు కూడా ఏమైనా స్పెషల్‌గా అభిమానులను అలరించనున్నాయో వేచిచూడాల్సివుంది....!

Saaho in Ramadan Race:

Saaho Teaser Release on Ramadan day
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs