Advertisement
Google Ads BL

ఆది పినిశెట్టి కొత్త చిత్ర వివరాలివే..!


ఆది పినిశెట్టి కొత్త చిత్రం..జూన్ 12 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్‌ 

Advertisement
CJ Advs

వైవిధ్య‌మైన క‌థ‌లు, పాత్ర‌ల‌తో మెప్పిస్తూ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యువ న‌టుడు ఆది పినిశెట్టి. ఈయ‌న త‌ర్వ‌లోనే ఓ స్పోర్ట్స్ డ్రామాలో న‌టించ‌బోతున్నారు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్  జూన్12 నుండి ప్రారంభం అవుతుంది. ప్రిత్వి ఆదిత్య ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌నుంది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి రూపొందించ‌నున్నారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను  తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. 

ఓ యువ‌కుడు అథ్లెట్‌గా మారే క్ర‌మంలో ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఫేస్ చేశాడు. వాటిని ఎలా అధిగ‌మించి ఉన్న‌త‌స్థాయికి చేరుకున్నాడ‌నేదే ప్ర‌ధాన క‌థాంశం. ఈ చిత్రాన్ని ఐబీ కార్తికేయ‌న్ నిర్మిస్తున్నారు. బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్ సంస్థ రూపొందిస్తోంది. పీఎంఎం ఫిల్మ్స్, జి.మ‌నోజ్‌, జి. శ్రీహ‌ర్ష (క‌ట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్‌) స‌హ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌వీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

న‌టీన‌టులు:

ఆది పినిశెట్టి

సాంకేతిక నిపుణులు

క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ప్రిత్వి ఆదిత్య‌

నిర్మాత‌: ఐబీ కార్తికేయ‌న్‌

బ్యాన‌ర్‌:  బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్

స‌హ నిర్మాత‌లు:  పీఎంఎం ఫిల్మ్స్, జి.మ‌నోజ్‌, జి.శ్రీ హ‌ర్ష (క‌ట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్‌)

సినిమాటోగ్రాఫ‌ర్‌:  ప్ర‌వీణ్ కుమార్‌

ఆర్ట్:  వైర‌బాల‌న్‌

ఎడిట‌ర్‌:  రాహుల్‌

Aadhi Pinisetty New Movie Details:

Aadhi Pinisetty New Movie Shooting Starts From June 12
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs