Advertisement
Google Ads BL

సూర్యని నిలువునా ముంచేశాడు


గత కొంతకాలంగా సూర్య సినిమాలు ప్లాప్స్ తో కొట్టుకుపోతున్నాయి. గతంలో విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన సూర్య ఇప్పుడు రొటీన్ మూసలో కొట్టుకుపోయాడు. యముడు, సింగం, సింగం 3 సినిమాలన్నీ పోలీస్ క్యారెక్టర్ లో అదరగొట్టిన సూర్య గ్యాంగ్ సినిమాలో రొటీన్ క్యారెక్టర్ తో, రొటీన్ కథతో మెప్పించలేకపోయాడు. ఇక నిన్నగాక మొన్నొచ్చిన ఎన్జీకే సినిమా కూడా సరైన ఓపెనింగ్స్ సాధించలేకపోయింది. ఒకప్పుడు తెలుగులో సూర్య మార్కెట్ 20 కోట్ల దాకా పలికేది. నేడు అది కనీసం ఐదు కోట్లు కూడా పలకడం లేదు. ఇక ఎన్జీకే సినిమా అయితే మొదటి షోకే బ్యాడ్ టాక్ తెచ్చుకుంది.

Advertisement
CJ Advs

సూర్య తన నటనతో ఎంతగా సినిమాని నిలబెడదామనుకున్నా... సెల్వ రాఘవన్ లాజిక్ లేని స్క్రీన్ ప్లేతో, కథతో, భరించలేని నిడివితో ప్రేక్షకులను బోర్ కొట్టించాడు. ఇప్పటికే సూర్య మార్కెట్ ఊగిసలాటలో ఉంటే... ఎన్జీకే ఘోర ప్లాప్ తో సూర్య మార్కెట్ మరింత దిగజారడం ఖాయంగా కనబడుతుంది. అసలు సెల్వ రాఘవన్ ని చూసి ఈ ఎన్జీకే కథను సూర్య ఒప్పుకున్నాడనిపిస్తుంది. అసలు కథలో కొత్తదనం లేకపోయినా... సెల్వ రాఘవన్ ఏదైనా మ్యాజిక్ చేస్తాడనుకున్నాడేమో అందుకే ఆ సినిమా చేసాడు సూర్య. 

కానీ సెల్వ... సూర్యని నిలువునా ముంచేశాడు. టాలెంటెడ్ హీరోయిన్స్ ని తీసుకున్నా.. వారిని సరిగ్గా వాడుకోలేకపోయాడు దర్శకుడు. మొన్న శుక్రవారం పెద్దగా పోటీ లేకుండా బరిలోకి దిగిన సూర్య సినిమాకి టాక్ బావుంటే కలెక్షన్స్ వర్షం కురిసేది. కానీ మొదటి షోకే ప్రేక్షకులే కాదు.... క్రిటిక్స్ కూడా ఎన్జీకేకి బ్యాడ్ మార్క్‌లేసేసారు.  దాంతో ఇప్పుడు ఎన్జీకేకి పెట్టిన పెట్టుబడి వస్తుందా? రాదా? అనేది ఊహించడం కూడా కష్టమే.

Suriya Market Downed in Tollywood:

Suriya NGK Movie gets Flop Result at Box Office 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs