Advertisement
Google Ads BL

ఈ ‘ఖైదీ’ కూడా హిట్టు కొట్టేలా ఉన్నాడు


కొంతకాలం కిందట మెగాస్టార్‌ చిరంజీవి నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘రాక్షసుడు’లో సూర్య నటించాడు. ఈ చిత్రం ఆ టైటిల్‌కే మచ్చ తెచ్చే విధంగా డిజాస్టర్‌గా మిగిలింది. ఇప్పుడు ఆయన సోదరుడు కార్తీ, చిరంజీవిని సుప్రీం హీరో నుంచి మెగాస్టార్‌ని చేయడంలో కీలకపాత్ర వహించిన ఎ.కోదండరామిరెడ్డి ‘ఖైదీ’ టైటిల్‌ని కార్తి ఏరికోరి ఎంచుకున్నాడు. ఈ టైటిల్‌కి మాత్రం ఖచ్చితంగా న్యాయం చేస్తాననే విధంగా ఈ మూవీ టీజర్‌ చూస్తే అర్ధమవుతోంది. కార్తీ ‘పరుత్తివీరన్‌, యుగానికొక్కడు, ఆవారా, నాపేరు శివ’ వంటి ఎన్నో హిట్‌ చిత్రాలు చేశాడు. ‘ఖాకీ’ చిత్రం కూడా మంచి విజయమే సాధించింది. 

Advertisement
CJ Advs

కానీ ఇటీవల వచ్చిన ‘దేవ్‌’ చిత్రం డిజాస్టర్‌ అయింది. అందుకే కార్తి ఈ సారి ‘ఖైదీ’గా తన వంతు ప్రయోగం చేస్తున్నాడు. ఈ చిత్రంలో కరడు గట్టిన క్రిమినల్స్‌ ఎలా ఉంటారో అచ్చు కార్తి కూడా అలాగే ఉన్నాడు. చేతులకు సంకెళ్లతో పోలీస్‌లు అరెస్ట్‌ చేస్తే తప్పించుకుని ఓ లారీలో ఇతను పారిపోతాడు. ఈయన కోసం ఒకవైపు పోలీస్‌ అధికారులు వెతుకుతుంటే మరో కరడుగట్టిన ఓ రౌడీ గ్యాంగ్‌ కార్తిని చంపితే కావాల్సినంత సుపారీ ఇస్తామనే భరోసాతో అతడిని చంపేందుకు వెతుకుతూ ఉంటుంది. ఇలా కార్తి, పోలీసులు, రౌడీగ్యాంగ్‌ల మధ్య నడిచే ముక్కోణపు డ్రామా అలరించేలా ఉంటుందని టీజర్‌ చూస్తేనే అర్ధమవుతోంది. 

సినిమా కేవలం కార్తి పోలీసుల నుంచి తప్పించుకున్న తర్వాత తెల్లవారే లోపు జరిగే కథ కావడంతో చీకటిలో సీన్స్‌తో మొత్తం టీజర్‌ని నింపేశారు. కెమెరామెన్‌ సత్యసూరన్‌ తన కెమెరా పనితనంతో అదరగొట్టాడు. లోకేష్‌ కనగరాజ్‌ టేకింగ్‌ అద్భుతంగా ఉంది. ఈ చిత్రం ఇదే టైటిల్‌తో తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది. ‘ఖైదీ’ అనే టైటిల్‌ పెట్టినందువల్ల తెలుగు ప్రేక్షకుల అటెన్షన్‌ని ఈ చిత్రం తనవైపుకు తిప్పుకోవచ్చనే భావించాలి. ఈ చిత్రం టీజర్‌ కూడా అంచనాలను పెంచే విధంగానే ఉందని చెప్పవచ్చు. 

Click Here For Teaser

Karthi Kaithi Teaser Released:

Good Response To Kaithi Teaser
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs