Advertisement
Google Ads BL

మూడూ మూడే.. బోర్ కొట్టించేశాయి!


నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్‌గా మూడు సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఒకటి స్ట్రయిట్ సినిమా, రెండు డబ్బింగ్ సినిమాలు కూడా వున్నాయి. ఇక తెలుగులో స్ట్రయిట్ సినిమాగా తెరకెక్కిన ఫలక్‌నుమా దాస్, తమిళంలో సూర్య హీరోగా తెరకెక్కిన ఎన్జీకే సినిమాతో పాటుగా... ప్రభుదేవా - తమన్నా - నందిత స్వేత జంటగా నటించిన అభినేత్రి సినిమాలు విడుదలయ్యాయి. ఇక విశ్వక్ సేన్ హీరో, డైరెక్టర్‌గా వచ్చిన ఫలక్‌నుమా దాస్ సినిమా అయితే యూత్‌ని టార్గెట్ చేస్తూ తెరకెక్కింది. అయితే యూత్‌ని టార్గెట్ చేస్తూ తీసిన ఈ సినిమాలో బూతులు తప్ప మరొకటి లేదంటూ, అలాగే నిడివి ఎక్కువ కావడం, విశ్వక్ సేన్ ఎంతగా మెప్పించిన కథనంలో పస లేకపోవడంతో ఫలక్‌నుమా దాస్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

Advertisement
CJ Advs

ఇక మంచి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య ఎన్జీకే సినిమా కూడా ప్లాప్ టాకే తెచ్చుకుంది. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ జంటగా తెరకెక్కిన ఎన్జీకే ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. సూర్య నటన మెప్పించి... దర్శకుడు సెల్వ రాఘవన్ ఎన్జీకెని ప్రేక్షకులు మెచ్చేలా తియ్యడంలో సక్సెస్ కాలేదు. ఇక ఫస్ట్ పర్వాలేదనిపించినా.. సెకండ్ హాఫ్‌తో ప్రేక్షకులకు విసుగు తెప్పించారు. ఇక హీరోయిన్స్‌లో సాయి పల్లవి కేరెక్టర్ ఎందుకు పెట్టారో అర్ధం కాదు. నటనతో మెప్పించినా ఆమె కేరెక్టర్‌ని దర్శకుడు సరిగ్గా తీర్చిదిద్దలేకపోయాడు. రకుల్ ఓకె. ఇక ఎన్జీకే సినిమాకి కనీసం యావరేజ్ టాక్ కూడా పడలేదు. 

ఇక ముచ్చటగా మూడో సినిమా అభినేత్రి 2. ప్రభుదేవా - తమన్నా జంటగా గతంలో తెరకెక్కిన అభినేత్రి సినిమా ఓకే అనిపించుకున్నప్పటికీ.. ప్రభుదేవా మళ్ళీ డేర్‌గా అభినేత్రికి సీక్వెల్‌గా అభినేత్రి 2 చేసాడు. అస్సలు ప్రమోషన్స్ లేకుండా నిస్సారంగా బరిలోకి వచ్చిన అభినేత్రి2 సినిమాకి సో సో మార్కులే పడ్డాయి. దర్శకుడు ఏఎల్ విజయ్ తను రాసుకున్న కథ కథనంలో ఎక్కడా ప్లో లేకపోగా, అనవసరమైన కామెడీ సీన్స్ పెట్టి.. ప్రేక్షకుడికి సినిమాపై కలిగే ఆ కాస్త ఆసక్తిని కూడా నీరు గార్చాడు. ఇంట్రస్టింగ్ ఎలెమెంట్స్‌ను పక్కన పెట్టి.. పండని కామెడీ అండ్ హారర్ సీన్స్ తో కథను డైవర్ట్ చేసారు.ఓవరాల్ గా సినిమా నెమ్మదిగా సాగుతూ బాగా బోర్ కొట్టిస్తోంది. దర్శకుడు ఏ ఎల్ విజయ్ హీరో పాత్రను కూడా సరిగ్గా రాసుకోలేదు. మరి ఈవారం విడుదలైన మూడు సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేక బోర్ కొట్టించేశాయి. 

NGK, Abhinetri 2, Falaknuma Das Movie Result at Box Office:

NGK, Abhinetri 2, Falaknuma Das gets negitive Talk at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs