ఈ సంక్రాంతికి బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘వినయ విధేయ రామ’ విడుదలై డిజాస్టర్ అయింది. అయినా సినిమా బాగా లేకపోయినా తమది ఎపిక్ బ్లాక్‌బస్టర్ అని ఎలాంటి హంగామా చేయకుండా రామ్‌చరణ్ నిజాయితీగా ‘వినయ విధేయ రామ’ ఫ్లాప్ అయింది. చాలా కష్టపడ్డాం..కానీ మిమ్మల్ని మెప్పించలేకపోయాం అని తెలిపాడు. ఈ ప్రకటన రామ్‌చరణ్‌పై ఉన్న గౌరవాన్ని మరింత పెంచింది.
ఇక తాజాగా అల్లుశిరీష్ కూడా ‘ఎబిసిడి’ విషయంలో తన హుందాతనాన్ని చాటుకున్నాడు. తాజాగా అల్లు శిరీష్ నటించిన ‘ఎబిసిడి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో పెద్ద హిట్ అయిన ఈ చిత్రాన్నితెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని టీం ఎన్నో నమ్మకాలు పెట్టుకుంది. కానీ ఇది తెలుగు వారి అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.
దీనిపై అల్లు శిరీష్ స్పందిస్తూ, మేము ఓ మంచి చిత్రం అందించేందుకు కష్టపడ్డాం. దర్శకనిర్మాతలు ఎంతో కృషి చేశారు. కానీ అంచనాలు అందుకోలేకపోయాం...అని తెలిపాడు. మొత్తానికి ఈ విషయంలో మాత్రం మెగాహీరోలు హుందాగా వ్యవహరించడం శుభపరిణామం.