Advertisement
Google Ads BL

ఈ అల్లు హీరోలో లోపం ఎక్కడ...?


మెగాకాంపౌండ్‌లో ప్రస్తుతం డజను మంది హీరోలు ఉన్నారు. వీరందరు మెగాస్టార్‌ చిరంజీవి అనే మహావటవృక్షం కింద ఉంటూ ఎదుగుతున్నారు. ఇక మెగా కాంపౌండ్‌లో అల్లు కాంపౌండ్‌ కూడా ఒక భాగం. అల్లుఅరవింద్‌ తనయులైన అల్లుఅర్జున్‌ ప్రస్తుతం టాప్‌స్టార్‌గా వెలుగొందుతున్నాడు. కానీ ఆయన సోదరుడు అల్లుశిరీష్‌ మాత్రం ఆరేళ్ల ముందు తెరంగేట్రం చేసి ‘శ్రీరస్తు..శుభమస్తు’ అనే ఒకే ఒక్క యావరేజ్‌ని సొంతం చేసుకున్నాడు. 

Advertisement
CJ Advs

ప్రకాష్‌రాజ్‌ చేతుల మీదుగా ‘గౌరవం’తో లాంచ్‌ అయి కొత్తజంట, ఆనంద్‌ అనే టాలెంటెడ్‌ డైరెక్టర్‌ తీసిన ‘ఒక్కక్షణం’, తాజాగా వచ్చిన ‘ఏబీసిడీ’ వంటి చిత్రాలన్నీ నిరాశనే మిగిల్చాయి. పోనీ ఇందులో ఆయన తప్పేమైనా ఉందా? అంటే అదీ లేదు. తన బాడీ లాంగ్వేజ్‌కి తగ్గ కథలనే ఎంచుకుంటున్నాడు. మలయాళంలో మోహన్‌లాల్‌ హీరోగా వచ్చిన చిత్రంలో నటిస్తే అది కూడా ఫ్లాప్‌ అయింది. ఇటీవల ఆయన ‘ఏబీసిడీ’ ప్రమోషన్స్‌లో భాగంగా వరుసగా ఐదారు చిత్రాలను ప్రేమకథలే చేస్తానని చెప్పాడు. ఐదారేళ్లు నటునిగా ఉండి తర్వాత నిర్మాతగా మారుతానని తెలిపాడు. 

అంటే నటనారంగంను పూర్తి చేసి ఆయన తన తండ్రి అల్లుఅరవింద్‌ గీతాఆర్ట్స్‌ బేనర్‌కి అధిపతి కావాలనే ఆలోచనలో ఉన్నాడు. మొత్తానికి ‘ఏబీసిడీ’ కూడా ఫ్లాప్‌కావడంతో అల్లుశిరీష్‌కి తొలి హిట్టు ఏ చిత్రం ద్వారా వస్తుందో చూడాలి...! మరీ అన్నయ్య స్థాయిలో కాకపోయినా తనవంతుగా నటునిగా ఓ స్థాయిలో నిలబడాలంటే ఏమి చేయాలా? అనే దీర్ఘాచనలో అల్లుశిరీష్‌ ఉన్నాడు. 

One More Flop in Allu Sirish Account:

 Allu Sirish Waiting for Big Hit
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs