Advertisement
Google Ads BL

నిఖిల్ బర్త్‌డే స్పెషల్: హిట్ సినిమా సీక్వెల్ స్టార్ట్స్


నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ‘కార్తికేయ- 2’

Advertisement
CJ Advs

2014లో యువకథానాయకుడు నిఖిల్, స్వాతి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘కార్తికేయ’ చిత్రం విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో విదితమే. అప్పటినుంచే ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘కార్తికేయ- 2’ చిత్రం రూపొందనుందన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికది నిజమవుతోంది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ- 2’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రంను ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని కథానాయకుడు నిఖిల్ పుట్టినరోజు జూన్ 1 సందర్భంగా అధికారికంగా వెల్లడి చేశారు. 

ఈ సందర్భంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ.. ‘‘నిఖిల్ హీరోగా.. దర్శకునిగా నా తొలి చిత్రం ‘కార్తికేయ’ ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో మా కాంబినేషన్‌లో రూపొందనున్న ‘కార్తికేయ - 2’ చిత్రంపై అంచనాలు అధికంగానే ఉంటాయన్నది వాస్తవం. దీనికి తగినట్టుగానే ఈ చిత్రం ఉంటుంది. ’కార్తికేయ’కు కొనసాగింపుగా ‘కార్తికేయ -2’ ఉంటూనే కథా, కథనాల విషయంలో సరికొత్తగా ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే పర్ఫెక్ట్ సీక్వెల్ ఈ చిత్రం..’’ అన్నారు.

‘కార్తికేయ- 2’ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. చిత్రంలోని ఇతర నటీ,నట సాంకేతికవర్గం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు. తమ కథానాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి నిర్మాత టి.జి.విశ్వప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల. కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: చందు మొండేటి

Nikhil, Chandoo Mondeti, People Media Factory’s film Karthikeya - 2 :

Karthikeya - 2 Film Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs