Advertisement
Google Ads BL

జగన్‌, నేను స్కూల్‌మేట్స్: వంశీ


సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా అందించిన ‘మహర్షి’. ఎపిక్‌ బ్లాక్‌ బస్టర్‌గా అఖండ ప్రజాదరణ పొందుతూ.. 100 కోట్ల షేర్‌ క్రాస్‌ చేసి ఇప్పటికీ సూపర్‌ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ‘‘భారతదేశ రాజకీయాల్లో 30 మే 2019 చాలా ముఖ్యమైన రోజు. భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. జగన్‌గారు, నేను స్కూల్‌మేట్స్‌. ఇద్దరం హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదివాం. ఆయన మాకు సీనియర్‌. స్కూల్‌లో రెడ్‌ హౌజ్‌ కెప్టెన్‌గా వ్యవహరించేవారు. అప్పటి నుండే ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. మా ‘మహర్షి’ టీమ్‌ తరపున వారిద్దరికీ శుభాకాంక్షలు. 

‘మహర్షి’ నేనెప్పుడూ చూడనంత పెద్ద బ్లాక్‌ బస్టర్‌తో పాటు మహేష్‌బాబు కెరీర్‌లోనే ల్యాండ్‌ మార్క్‌ మూవీగా నిలిచింది. ఏ నమ్మకంతో అయితే సినిమా స్టార్ట్‌ చేశామో ఈరోజు ఆ నమ్మకాన్ని తెలుగు ప్రేక్షకులు నిజం చేశారు. ఈ సినిమా విజయంతో పాటు మాకిచ్చిన రెస్పెక్ట్‌ మా జీవితాంతం గుర్తుండిపోతుంది. ఎక్కడికెళ్ళినా రైతులు తమ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని మాకు ఒక గుర్తింపునిచ్చారన్నా అంటున్నారు. మాకెలా స్పందించాలో తెలియలేదు. ఈ సినిమా ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం. రైతులను మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్టే. సొసైటీలో ఇది ఇంత ఇంపాక్ట్‌నిచ్చి అంతమందిని ఇన్‌స్పైర్‌ చేసే సినిమా అయినందుకు మా టీమ్‌ అందరికీ మా కృతజ్ఞతలు. ఈ విజయం వెనుక మా టీమ్‌ కృషి ఎంతో ఉంది. నాలుగోవారంలోకి వచ్చినా కూడా ఈ సినిమా గురించి మాకు ఫోన్లు వస్తున్నాయి. ఈ సినిమాను అభినందించిన ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ఇండస్ట్రీ ప్రముఖులకు మా టీమ్‌ అందరి తరపున ధన్యవాదాలు. కొన్ని కొన్ని సినిమాలు మన జీవితాల్లో తీపి గుర్తులుగా మిగిలిపోతాయి. అలాంటి సినిమానే ‘మహర్షి’. ఈ సినిమాకి ఇంతటి కలెక్షన్స్‌ ఇచ్చి, అంతకంటే మంచి రెస్పెక్ట్‌ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్‌. ఈ రెస్పెక్ట్‌ని మా నెక్స్‌ట్‌ మూవీకి కాపాడుకుంటాం. అలాగే ఈ సినిమా చూసి సూర్యగారు ఒక మెమొరబుల్‌ కాంప్లిమెంట్‌ ఇచ్చారు. నన్ను అడ్మైర్‌ చేసిన యాక్టర్స్‌లో ఒకరు. ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు. ‘వంశీ.. ఒక 20, 25 ఇయర్స్‌ వరకు మనం ఒక సొసైటీ నేర్పిందో లేదా ఒక స్కూల్‌ నేర్పిందో, పేరెంట్స్‌ నేర్పిందో పట్టుకొని వెళ్తుంటాం. కానీ మీ సినిమా ద్వారా 20, 25 సంవత్సరాల్లో నేర్చుకోని ఒక థాట్‌ను ప్రొవోక్‌ చేశారు. మీరు రాసిన కథ, మహేష్‌గారు చూపించిన గట్స్‌, సోషల్‌ మెసేజ్‌ కానీ అమేజింగ్‌’ అన్నారు. 175 రోజులు మహేష్‌గారితో ట్రావెల్‌ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా రిలీజయ్యాక 21 రోజులు ఆయనతో ఇంకా అన్యూన్యంగా గడిపే సమయం లభించింది. ఫస్ట్‌ నుండి మాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచిన మీడియాకు ధన్యవాదాలు. మాకు, ప్రేక్షకులకు మీరే వారథి. హాలిడే ట్రిప్‌కి యూరప్‌ వెళుతున్నాను. వచ్చాక మా నెక్స్‌ట్‌ సినిమా వివరాలు తెలియజేస్తాం’’ అన్నారు.

Vamsi Paidipalli about Mahrshi Success:

Vamsi Paidipalli and Dil Raju Maharshi Movie Press Meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs