Advertisement
Google Ads BL

RRR‌లో ఎన్టీఆర్ సరసన ఈ భామేనా?


నటనకు ప్రాధాన్యతనిచ్చే నటీమణుల్లో ఈతరం హీరోయిన్స్ అందరిలో సాయి పల్లవి ముందుంటుంది. తన పాత్రకి ప్రాధాన్యతను బట్టే సినిమాలు చేస్తుంది. అందుకే ఆమె నటించిన చాలా సినిమాలు హిట్ అవుతాయి కూడా. ఇక సాయి పల్లవి సినిమా ఒప్పుకోవాలంటే ఆమెకి పాత్ర తీరుతెన్నులు చాలా బాగా నచ్చాలి. తాజాగా సాయి పల్లవి తమిళంలో మారి 2 తో ప్లాప్ కొట్టింది. ఇక సూర్య తో కలిసి నటించిన ఎన్‌జికె సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా టాక్ ఎలా ఉన్నా.. ఇప్పుడు సాయి పల్లవి RRR లో భాగం కాబోతుందనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది. అందులో నిజమెంతుందో తెలియదు కానీ.. RRR లో సాయి పల్లవి నటించబోతుంది అంటూ న్యూస్ మాత్రం హైలెట్ అయ్యింది.

Advertisement
CJ Advs

RRR కోసం ఎన్టీఆర్ సరసన ఒక హాలీవుడ్ భామను ఎంపిక చేసిన రాజమౌళి... ఆ హీరోయిన్ అర్దాంతరంగా హ్యాండ్ ఇవ్వడంతో.. ఇంతవరకు మళ్ళీ ఎన్టీఆర్ సరసన బ్యూటీని సెట్ చెయ్యలేదు. ఇక ఎన్టీఆర్ సరసన ఒక బ్రిటిష్ యువతిని ఎంపిక చేసే ఉద్దేశ్యంతో రాజమౌళి గతంలో హాలీవుడ్ పాపని తీసుకున్నాడు. కానీ తాజాగా మళ్ళీ బ్రిటిష్ యువతి పాత్రధారి కోసం ఎవరూ దొరకడం లేదట. అయితే ఈ రిస్క్ అంత ఎందుకులే అనుకున్న రాజమౌళి కొమరం భీం కథలోనే కొద్దిగా మార్పులు చేసి ఆ పాత్రను భారతీయ యువతిగా మార్చేశారట. ఇక భారతీయ యువతి పాత్రధారి కోసం ఇప్పుడు సౌత్ నుండి సాయి పల్లవిని తీసుకోబోతున్నారనే న్యూస్ వినబడుతుంది. ఇప్పటికే RRR టీం సాయి పల్లవిని సంప్రదించారనే న్యూస్ వినబడుతుంది.

Fidaa Beauty in Rajamouli RRR :

Sai Pallavi in Rajamouli RRR Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs