Advertisement
Google Ads BL

ఈ స్టార్ హీరోకి.. హీరోయిన్స్ హిట్టిస్తారా!


సింగం వన్, టుతో హిట్స్ కొట్టిన హీరో సూర్య సింగం సీరీస్ లో లాస్ట్ వచ్చిన సింగం 3 ప్లాప్ అయ్యింది. అయితే సింగం సీరీస్ తెలుగులో పర్వాలేదనిపించింది.. తమిళంలో సూపర్ హిట్స్. అయితే గజినీ లాంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సూర్య తర్వాత వరస ప్లాప్స్ తో తెలుగులో మార్కెట్ కోల్పోయాడు. తన ప్రతి సినిమాని తమిళంతో పాటే తెలుగులోనూ విడుదల చేసే సూర్యకి ఇప్పుడు తెలుగులో సగానికి సగం మార్కెట్ పడిపోయింది. ప్రస్తుతం ఎన్‌జికె సినిమాతో రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సూర్య.

Advertisement
CJ Advs

అయితే ఎన్‌జికె తెలుగులో 9 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అసలు సూర్య స్టార్ డమ్ కి ఈ 9 కోట్లు చాలా చిన్న మొత్తం. కానీ వరస ప్లాప్స్ తో ఉన్న సూర్యకి ఆ 9 కోట్లు రావడమే అదృష్టం అన్నట్టుగా ఉంది. అయితే ఇప్పుడు ఎన్‌జికె తెలుగులో ఎలాగైనా హిట్ అవుతుందని సూర్య ఆశిస్తున్నాడు. 7/జి బృందావన్ కాలనీ సినిమాతో పేక్షకులకు దగ్గరైన సెల్వ రాఘవన్ ఫిదా, ఎంసీఏ సినిమాలో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సాయి పల్లవి క్రేజ్, తెలుగులో టాప్ హీరోస్ అందరితో నటించిన రకుల్ ప్రీత్ కూడా మరో హీరోయిన్ గా ఎన్‌జికె లో నటించడంతో ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుందని సూర్య భావిస్తున్నాడు. 

అలాగే ప్రస్తుతం క్రేజ్ లేని సూర్య ఎన్‌జికె సినిమా విడుదలై హిట్ టాక్ పడితేనే కానీ... ఆ సినిమాకి పెట్టిన పెట్టుబడి రావడం కూడా కష్టమే. మహర్షి తర్వాత సరైన సినిమా లేక బోర్ కొడుతున్న ప్రేక్షకులు ఎన్‌జికె మీద ఎంతో కొంత ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఎన్‌జికె బుకింగ్స్ చూస్తే సినిమా మీద ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉందో తెలుస్తుంది.

Suriya Hopes on Rakul and Sai Pallavi:

Suriya Wants Big Hit in Tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs