Advertisement
Google Ads BL

హవీష్, అభిషేక్ పిక్చర్స్ మూవీ మొదలైంది


హవీష్ హీరోగా రాఘవ ఓంకార్ శశిధర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ప్రొడక్షన్ నెంబర్ .5 గా ఓ రొమాంటిక్ లవ్ స్టోరీని రూపొందిస్తున్నారు. ఈ నయా చిత్రం బుధవారం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో ఘనంగా ప్రారంభమైంది. హీరోపై చిత్రీకరించిన ముహూర్త‌పు సన్నివేశానికి అతిధిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ క్లాప్ నివ్వగా, సధానంద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఏషియన్ సునీల్ నారంగ్ స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిత్ర దర్శకుడు శశిధర్ మాట్లాడుతూ, ‘14 ఏండ్లుగా సినీ రంగంలో ఉన్నా. ‘ఓంకార’ అనే ఇండిపెండెంట్ చిత్రాన్ని, ‘లడ్డు’, ‘నన్ను క్షమించు’ వంటి లఘు చిత్రాల్ని రూపొందించాను. వాటికి ప‌లు నంది అవార్డులు, జాతీయ‌, అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు వ‌రించాయి. నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన తల్లిదండ్రులు ఎంత గొప్పవారో, ఓ దర్శకుడికి తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత, హీరో అంతే గొప్పవారు. నన్ను నమ్మిన నిర్మాత అభిషేక్ గారికి, హీరో హ‌వీష్ గారికి థ్యాంక్స్. న‌న్ను ద‌ర్శ‌కుడిగా ఎంపిక చేసిన సుకుమార్‌కి ధ‌న్య‌వాదాలు.  వారి న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటాను. ఓ కొత్త రకమైన రొమాంటిక్ లవ్ డ్రామా చిత్ర‌మిది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. భావోద్వేగ‌భ‌రితంగానూ ఉంటుంది. జూలై చివ‌రి వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌ని జ‌రుప‌నున్నాం’ అని అన్నారు. 

Advertisement
CJ Advs

హీరో హ‌వీష్ మాట్లాడుతూ, ‘నేను హీరోగా న‌టించిన ‘సెవెన్’ చిత్రం నెక్ట్స్ వీక్ విడుద‌ల‌వుతుంది. అభిషేక్ నామా ఆ సినిమాని రిలీజ్‌ చేస్తున్నారు. అభిషేక్ గారు ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్‌. మా సినిమాని విడుద‌ల చేస్తున్న‌ ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు. శ‌శిధ‌ర్ ఎక్స్ ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌. త‌ను భ‌విష్య‌త్‌లో పెద్ద ద‌ర్శ‌కుడ‌వుతాడు. ఫ్యామిలీ, రొమాంటిక్ ల‌వ్ స్టోరీ ఇది. ఇందులో హీరోగా న‌టిస్తున్నందుకు, అభిషేక్ ప్రొడ‌క్ష‌న్‌లో వ‌ర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక మా ‘సెవెన్’ సినిమా ఈ స‌మ్మ‌ర్ లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాబోతుంది. చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా’ అని చెప్పారు. 

చిత్ర నిర్మాత అభిషేక్ నామా చెబుతూ, ‘చాలా రోజులుగా శ‌శిధ‌ర్‌తో ట్రావెల్ అయ్యాం. సుకుమార్, మేం నిర్వ‌హించిన షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో శ‌శిధ‌ర్ మొద‌టి బ‌హుమ‌తిని పొందారు. దాని ఆధారంగా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వ అవ‌కాశం క‌ల్పించాం. ఫ్యామిలీ అంతా క‌లిసి చూసేలా ఈ సినిమాని తెర‌కెక్కించ‌బోతున్నాం. ఇందులో న‌టించే ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్ల వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డిస్తాం’  అని అన్నారు. ఈ కార్యక్ర‌మంలో నిర్మాతలు సి.క‌ళ్యాణ్‌, బెక్కం వేణుగోపాల్‌, సుధాక‌ర్ రెడ్డి, మ‌ల్టీ డైమెన్ష‌న్ వాసు, ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ త‌దిత‌ర సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. 

టెక్నీషియ‌న్లు- 

బ్యాన‌ర్: అభిషేక్ పిక్చ‌ర్స్ 

స‌మ‌ర్ప‌ణ: దేవాన్ష్ నామా

నిర్మాత: అభిషేక్ నామా

ద‌ర్శ‌కుడు: రాఘ‌వ ఓంకార్ శ‌శిధ‌ర్ 

సంగీతం: చైత‌న్ భ‌ర‌ద్వాజ్ 

ఎడిట‌ర్: అమ‌ర్ రెడ్డి కుడుముల‌

డీఓపీ: సాయి శ్రీరామ్‌

పీఆర్ ఓ: వంశీ శేఖ‌ర్‌

Havish New Film Launched:

Havish and Abhishek Pictures Movie Launch Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs