Advertisement
Google Ads BL

‘RX100’ హీరో ‘గుణ 369’ లుక్ వచ్చేసింది


కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ క‌డియాల‌, తిరుమ‌ల్ రెడ్డి నిర్మిస్తోన్న‌ ‘గుణ 369’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Advertisement
CJ Advs

‘ఆర్‌ ఎక్స్ 100’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘గుణ 369’. బుధవారం ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర‌మిది. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. ‘‘ఇటీవ‌ల ఒంగోలులో చిత్రీక‌రించిన భారీ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. కొత్త త‌ర‌హా క‌థ‌లతో ఇత‌ర భాష‌ల్లో సినిమాలు వ‌స్తున్న‌ట్టు... తెలుగులో సినిమాలు రూపొంద‌ట్లేద‌నే బాధ‌ను మా సినిమా తీరుస్తుంది. కంటెంట్ ప‌రంగా ఆద్యంతం కొత్త‌గా ఉంటుంది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన కాసేప‌టికే చాలా మంది ఫోన్లు చేసి ప్ర‌శంసిస్తున్నారు. పోస్ట‌ర్ వైవిధ్యంగా ఉంద‌ని మెచ్చుకుంటున్నారు. స‌ర్వ‌త్రా పాజిటివ్ వైబ్రేష‌న్స్ క‌నిపిస్తున్నాయి’’ అని అన్నారు.

నిర్మాత‌లు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఒంగోలులో భారీ షెడ్యూల్‌ను నిర్విఘ్నంగా పూర్తి చేశాం. మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఫైన‌ల్ స్టేజెస్‌లో ఉన్నాయి. సినిమా చాలా బాగా వ‌స్తోంది. పాట‌లు కూడా విన‌గానే ఆక‌ట్టుకునేలా ఉంటాయి. కార్తికేయ‌ని కొత్త లుక్‌లో చూస్తారు. ‘ఆర్‌ ఎక్స్ 100’కూ, ఈ చిత్రంలో కార్తికేయ పాత్ర‌కూ చాలా వైవిధ్యం ఉంటుంది. ఆయ‌న న‌టుడిగా మా చిత్రంలో మ‌రింత విజృంభించి చేశారు. పంచెలుక్కులో కార్తికేయ‌ కొత్త‌గా ఉన్నారు. ఆయ‌న‌ కెరీర్‌లో నిలిచిపోయే సినిమా అవుతుంది. మా తొలి చిత్రం ఇంత బాగా వ‌స్తున్నందుకు నిర్మాత‌లుగా మేం కూడా చాలా చాలా ఆనందిస్తున్నాం. గొప్ప టెక్నీషియ‌న్లు ప‌నిచేస్తున్నారు. అంద‌రినీ మెప్పిస్తుంది’’ అని అన్నారు.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్‌, కెమెరామెన్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ : జీయమ్‌ శేఖర్, ఎడిటర్ : తమ్మిరాజు , డాన్స్ : రఘు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : శివ మల్లాల.

Guna 369 Movie First Look Launched:

Rx 100 Hero Karthikeya New Movie Guna 369 first Look out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs