Advertisement
Google Ads BL

తమిళ, మలయాళంలోకి ‘కేరాఫ్‌ కంచెరపాలెం’


తమిళ, మలయాళంలో ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ చిత్రాన్ని రీమేక్‌ చేయబోతున్నా: యమ్‌. రాజశేఖర్‌ రెడ్డి

Advertisement
CJ Advs

గతేడాది విడుదలైన చిన్న బడ్జెట్‌ చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన వాటిలో ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ ఒకటి. ఇప్పుడీ సినిమా తమిళ, మలయాళ భాషల్లో రీమేక్‌ కానుంది. దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తమిళంలో ఘనవిజయం సాధించిన ‘శైవం’తో పాటు తెలుగులో ‘కలర్స్‌’ స్వాతి, నవీన్‌ చంద్ర ముఖ్య తారలుగా ‘గీతాంజలి’ ఫేమ్‌ రాజకిరణ్‌ దర్శకత్వంలో ‘త్రిపుర’ చిత్రాన్ని నిర్మించిన యమ్‌. రాజశేఖర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయనున్నారు. నేడు (బుధవారం) రాజశేఖర్‌ రెడ్డి పుట్టినరోజు.

ఈ సందర్భంగా ííషిరీడీ సాయి మూవీస్‌ పతాకంపై తాను నిర్మించనున్న చిత్రాల గురించి రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘స్ట్రయిట్‌ చిత్రాలు నిర్మించడంతో పాటు గతంలో విజయ్‌ ఆంటోనీని తెలుగు తెరకు పరిచయం చేసిన ‘నకిలీ’, అలాగే ‘ప్రేమలో పడితే’, తమిళ చిత్రాలను తెలుగులోకి డబ్బింగ్‌ చేశాను. అలాగే తెలుగులో సిద్ధార్థ్, శ్రుతీహాసన్, హన్సిక కాంబినేషన్‌లో రూపొందిన ‘ఓ మై ఫ్రెండ్‌’ చిత్రాన్ని తమిళంలో ‘శ్రీధర్‌’ పేరుతో అనువదించి, విడుదల చేశాను. గతంలో నేను హోటల్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్‌ రంగాలలో అనేక బిజినెస్‌లు చేశాను. ఎన్ని బిజినెస్‌లు చేసినా నాకు తృప్తినిచ్చేది సినిమా మాత్రమే. అందుకే మంచి సినిమాలు తీయాలనే నిర్ణయంతో నా పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను.

ఈ మధ్య నేను చూసిన బెస్ట్‌ సినిమా ‘కేరాఫ్‌ కంచెరపాలెం’. ఆ సినిమాలోని చాలా సన్నివేశాలకు నేను కనెక్ట్‌ అయ్యాను. సినిమా చూడగానే డైరెక్ట్‌గా సురేశ్‌బాబు దగ్గరికెళ్లి ఫ్యాన్సీ రేట్‌ చెల్లించి ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ చిత్రం తమిళ, మలయాళ రైట్స్‌ను సొంతం చేసుకున్నాను. సినిమా రైట్స్‌ సొంతం చేసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కంప్లీట్‌ చేశాం. తమిళంలో పేరు పొందిన నటీనటులు ఈ సినిమాలో నటిస్తారు.

మలయాళ వెర్షన్‌ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా అతి త్వరలో కంప్లీట్‌ చేస్తాం. జూన్‌ నెల చివరి వారంలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుంది. ఇది కాకుండా తెలుగులో మంచి పేరున్న నటీనటులతో ఓ సినిమా చేయబోతున్నాను. ఆ సినిమా వివరాలు త్వరలో ప్రకటిస్తాను’’ అని చెప్పారు.  

Care of Kancharapalem Remakes in Tamil and Malayalam:

M Rajasekhar Reddy Remakes Care of Kancharapalem in Tamil and Malayalam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs