Advertisement
Google Ads BL

మహేష్‌ హీరోయిన్‌ కిస్‌ గురించే చర్చలు..!


తెలుగు వారికి కియారా అద్వానీ బాగానే పరిచయం. ‘ఎంఎస్‌ధోని’తో పాటు ఆమె మహేష్‌బాబు సరసన ‘భరత్‌ అనే నేను’, రామ్‌చరణ్‌ సరసన ‘వినయ విధేయ రామ’లలో నటించింది. ప్రస్తుతం ఈమె సామాన్యంగా బాలీవుడ్‌లో కూడా హీరోయిన్‌ చేయడానికి జంకేలా ఉండే తెలుగు ‘అర్జున్‌రెడ్డి’లో నటిస్తోంది. ‘కబీర్‌సింగ్‌’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో షాహిద్‌ కపూర్‌ హీరోగా నటిస్తుండగా, కియారా అద్వానీ హీరోయిన్‌ పాత్రను చేసింది. తెలుగు ఒరిజినల్‌ వెర్షన్‌ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగానే బాలీవుడ్‌లో కూడా డైరెక్షన్‌ చేయనుండటం, కియారా అద్వానీ బోల్డ్‌ పాత్రలో నటించడంతో ఈ మూవీపై తెలుగు ప్రేక్షకులు కూడా ఓ కన్నేసి ఉన్నారు. 

Advertisement
CJ Advs

ఇప్పటికే ఈ చిత్రం టీజర్‌ అందరినీ బాగా మెప్పించింది. మూడురోజుల కిందట ఈచిత్రం నుంచి ప్రియురాలు దూరమైన విరహ వేదనను హీరో అనుభవించే సాంగ్‌ ఒక్కటి విడుదల చేశారు. ‘బేఖయాలి మే’ అనే ఈ పాట ప్రస్తుతం దేశం మొత్తం ఓ ఊపు ఊపుతోంది. పాట విడుదలైన మూడు రోజుల్లోనే ఈ పాటకి 20 మిలియన్లకు పైగా వ్యూస్‌ లభించడం విశేషం. ఇది కేవలం టిసిరీస్‌ వారి అఫీషియల్‌ యూట్యూబ్‌లోని లెక్క మాత్రమే. 

మరి అన్నింటా ఈ పాటకి వచ్చిన వ్యూస్‌, లైక్స్‌ని లెక్కిస్తే ఇదో సంచలనం అని చెప్పాలి. ఈ పాటలో కియారా, షాహిద్‌ కపూర్‌ల మధ్య సాగిన కిస్‌ అద్బుతంగా ఉంది. బైక్‌పై వెళ్తూ ఉంటే కియారా, షాహిద్‌కి ముద్దుపెడుతూ ఉండటం, ఇద్దరు బండి మీద నుంచి కిందపడి పోవడం, పడిపోయినా కూడా మరింతగా ఆ లిప్‌లాక్‌ని మరింత ఘాడంగా కంటిన్యూ చేయడం వంటివి యూత్‌ని కట్టిపడేస్తున్నాయి. ఈ లిప్‌లాక్‌ బాలీవుడ్‌ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తోందనే చెప్పాలి. 

Discussion on Liplock in Kabir Singh Movie:

Shahid Kapoor and Kiara Adwani Liplock Creates sensation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs