పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ తాను పోటీ చేసిన భీమవరం, గాజువాక రెండింటిలో ఓడిపోయాడు కాబట్టి సరిపోయింది.. పవన్ ఆ రెండు చోట్ల గెలిచి ఉంటే ఆయన పట్టుబడి నరసాపురం ఎంపీగా పోటీ చేయించిన మెగాబ్రదర్ నాగబాబు ఓటమి హాట్‌టాపిక్‌గా మారి ఉండేది. పవన్ తన అన్నయ్య విజయం కోసం సరిగా కృషి చేయలేదా? వరుణ్‌తేజ్, నాగబాబు ఫ్యామిలీ తప్ప మిగిలిన మెగాకాంపౌండ్ వారు వచ్చి స్వయంగా ప్రచారం చేయకపోవడమే కొంప ముంచిందా? అని మన కుహానా విశ్లేషకులు కోడిగుడ్డుపై ఈకలు పీకేవారు. కానీ ఇలాంటివారు పవన్, నాగబాబు ఇద్దరు ఓడిపోయినా మరో విషయంలో బోడిగుండుకి మోకాలికి ముడేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్నికల ముందు జరిగిన ‘మా’ ఎన్నికల్లో నాగబాబు నరేష్, రాజశేఖర్ దంపతుల పక్షం వహించి శివాజీ రాజాకి ఆపోజిట్‌గా పనిచేశాడు. ఈ ఎన్నికల్లో శివాజీరాజా ఘోర ఓటమి పాలైన తర్వాత తాను కూడా నాగబాబుకి రిటర్న్‌గిఫ్ట్ ఇస్తానని చెప్పి, తన పదవి కాలంలో నాగబాబు ‘మా’ని రెండేళ్లు వెనక్కి తీసుకెళ్లాడని రచ్చరచ్చ చేశాడు. నిజానికి శివాజీరాజా పరిస్థితి ఏమిటి అంటే ఆయన వ్యక్తిగతంగా మంచి వాడా? కాదా? అనే విషయాలను పక్కనపెడితే ఎంపీగా పోటీ చేసిన నాగబాబు ఓటమికి కారణమయ్యేంత సీన్ ఆయనకు లేదు. నాగబాబు చేసింది శివాజీ రాజా సొంత ఊరే అయినా ఆయన పరిస్థితి బుల్లితెరకు ఎక్కువ... సినీ కమెడియన్‌కి తక్కువ అనే పరిస్థితి.
తనను ఇంతవాడిని చేసిన మా కే ఏమీ చేయని నాగబాబు తాను పోటీ చేసే ప్రాంతానికి, ప్రజలకు ఏమి చేయగలడని విమర్శించినా, వైస్‌జగన్ గాలి వల్ల నాగబాబు ఓడిపోయాడు. అంతేకాదు.. మహామహులైన టిడిపి సీనియర్లు, స్వయంగా లోకేష్, చంద్రబాబుతో సహా ఇద్దరు మంత్రులు మాత్రమే ఓటమి నుంచి గట్టెక్కగలిగారు. అది జగన్‌ని గెలిపించాలని కాపులతో సహా అందరు వేసిన ఓట్లే గానీ ప్రత్యేకంగా పవన్, నాగబాబుల ఓటములకు కారణాలను ఈ జగన్‌గాలిలో విశ్లేషించడం సమంజసం కాదనే చెప్పాలి.