Advertisement
Google Ads BL

టి.సిరీస్‌ ‘సాహో’ని ఏం చేస్తుందో..?


బాహుబలితో నేషనల్‌స్టార్‌గా, నేషనల్‌ ఐకాన్‌గా పేరు తెచ్చుకున్న యంగ్‌రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ దాని తదుపరి తాను చేస్తోన్న హాలీవుడ్‌ రేంజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సాహో’ రిలీజ్‌పై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ‘సాహో’ లుక్‌లో ఈ చిత్రం స్వాతంత్య్రదినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న రానున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. దాంతో ప్రభాస్‌ అభిమానులు కౌంట్‌డౌన్‌ కూడా స్టార్‌ చేశారు. తెలుగులో మాత్రం ఈ చిత్రం సత్తా తెలిసిన వారు ఎవ్వరూ ఆ దరిదాపుల్లో తమ చిత్రాలు లేకుండా జాగ్రత్తపడుతున్నారు. కానీ కోలీవుడ్‌, బాలీవుడ్‌లో మాత్రం పోటీ కనిపిస్తోంది. సూర్య, మోహన్‌లాల్‌ వంటి భారీ తారాగణం నటిస్తున్న దాదాపు దేశభక్తి చిత్రమే అయిన ‘కాప్పన్‌’ని అదే తేదీకి ఫిక్స్‌ చేసేలా ఉన్నారు. 

Advertisement
CJ Advs

ఇక బాలీవుడ్‌లో మాత్రం ఏకంగా ఇద్దరు స్టార్స్‌ తమ రెండు చిత్రాలతో ‘సాహో’కి పోటీగా వస్తున్నారు. అక్షయ్‌కుమార్‌ హీరోగా నటించిన ‘మిషన్‌ మంగళ్‌’ని అదే తేదీకి ఫిక్స్‌చేశారు. ఇందులో అక్షయ్‌కుమార్‌ హీరోగా నటిస్తుండగా, విద్యాబాలన్‌, తాప్సి, నిత్యామీనన్‌, సోనాక్షిసిన్హా వంటి భారీ తారాగణం నటిస్తోంది. ఇస్రో శాస్త్రవేత్త బయోపిక్‌గా ఇది రూపొందుతోంది. ఇక అదే తేదీన రానున్న మరో చిత్రం జాన్‌ అబ్రహం నటించిన ‘బాట్లాహౌస్‌’. హోమ్‌ ఎన్‌కౌంటర్‌ నేపధ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ముంబై క్రైమ్‌ వరల్డ్‌లో పేరు మోసిన ‘హౌస్‌ ఇన్‌ ఎన్‌కౌంటర్‌’గా రూపొందే ఈచిత్రం కూడా పోటీ ఉండనుంది. దీంతో కలెక్షన్ల కంటే ముందుగా థియేటర్ల విషయంలో ‘సాహో’కి పోటీ ఎదురయ్యే సమస్యలు ఉన్నాయి. 

‘బాహుబలి’ సమయంలో కరణ్‌జోహార్‌ బాలీవుడ్‌ మొత్తాన్ని నియంత్రణ చేసి థియేటర్లు దక్కించుకున్నాడు. మరి ఆ రేంజ్‌లో ఈ మూవీని బాలీవుడ్‌లో విడుదల చేయనున్న ‘టి-సిరీస్‌’ థియేటర్లను సంపాదిస్తుందా? లేదా? అనేది చూడాలి? ఇక పిచ్చితుగ్లక్‌లా పవన్‌, బాహుబలి, చిరు, రజనీల గురించి ఏవోవే వ్యాఖ్యలు చేసే కమల్‌ ఆర్‌.ఖాన్‌ ఈ ఏడాది విడులయ్యే చిత్రాలలో ‘సాహో’ డిజాస్టర్‌ కానుందని అంటున్నాడు. అయిన టీజర్‌ కూడా రిలీజ్‌ అవ్వకుండా ఈయన వాగే మాటలకు విలువ ఉండదనే చెప్పాలి. 

T Series Release Saaho in Bollywood:

Saaho bollywood hopes on T Series
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs