Advertisement
Google Ads BL

గీతా మేడమ్‌కి పోటీ లేకుండా పోతోంది!


ఎంతైనా టాలీవుడ్‌ సినీ ప్రేమికులలో ఓ తెలియని వింత ఉంది. కోలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌లాగా మన ప్రేక్షకులు, నిర్మాతలు, హీరోలు ఒకే హీరోయిన్‌ ఎక్కువ కాలం కొనసాగితే భరించలేరు. ఒక హీరో సరసన ఒకసారి నటించిన హీరోయిన్‌ని మరోసారి చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. ఏదో విజయశాంతి, అనుష్క, సమంత వంటి వారి విషయాలలోనే అలా జరుగుతోంది. కానీ ఇటీవల మన ప్రేక్షకుల్లో కూడా కాస్త మార్పు వచ్చింది. కాజల్‌, తమన్నా, త్రిష, శ్రియ వంటి వారిని చాలా కాలమే మోశారు. ఇప్పుడు మరలా కొత్త పరిస్థితి వచ్చింది. సమంత పెళ్లి తర్వాత ఏ సినిమా పడితే అది చేయడం లేదు. అనుష్కది అదే పరిస్థితి. రకుల్‌ప్రీత్‌సింగ్‌ ముచ్చట మూడునాళ్లే అయింది. సాయిపల్లవి, కీర్తిసురేష్‌లు తెలుగు ఇండస్ట్రీని ఏలుతారని భావించినా ఎక్స్‌పోజింగ్‌కి నో అనడంతో వీరికి పెద్దగా రిపీటెడ్‌ చిత్రాలు రావడం లేదు. 

Advertisement
CJ Advs

ఇదే సమయంలో కన్నడ ‘కిర్రాక్‌పార్టీ’లో నటించిన రష్మిక మండన్న అటు నటనతో, ఇటు అభినయంతో ఆకట్టుకుంటోంది. అందునా ఆమె వివాహం రద్దుకావడం బాగా కలిసి వచ్చింది. ‘ఛలో’ చిత్రంతో నాగశౌర్య హీరోగా వచ్చిన చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ ‘గీతాగోవిందం’తో ఎక్కడికో వెళ్లిపోయింది. అందునా విజయ్‌దేవరకొండ సరసన మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అన్నట్లుగా ఉందని, లిప్‌లాక్‌లకు కూడా నో చెప్పదని అర్ధమైంది. ఇంకేముంది అవకాశాలు తరుముకుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె రెండో సారి విజయ్‌ దేవరకొండ సరసన ‘డియర్‌ కామ్రేడ్‌’లో నటిస్తోంది. మరోవైపు నితిన్‌ హీరోగా తన మొదటి చిత్రం దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘భీష్మ’లో నటిస్తోంది. ఇవ్వన్నీ ఒక ఎత్తైతే ఆమె టాలీవుడ్‌లో టాప్‌స్టార్స్‌గా పేరు తెచ్చుకున్న మహేష్‌బాబు సరసన అనిల్‌రావిపూడి చిత్రంతో పాటు అల్లుఅర్జున్‌-సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందే మూవీలో కూడా హీరోయిన్‌గా చాన్స్‌ దక్కించుకుందని సమాచారం. 

ఇక ఈమె ప్రస్తుతం కార్తి సరనన ఓ చిత్రంలో నటిస్తూ కోలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. ఇదే సమయంలో ఆమె తమిళ తిరుగులేని స్టార్‌, తెలుగులో మహేష్‌ వంటి ఫాలోయింగ్‌ ఉన్న విజయ్‌ నటించే 64 చిత్రంలో కూడా ఎంపికైందని సమాచారం. ఈమూవీని లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈమెకి మాతృభాష కన్నడలో కూడా పలు ఆఫర్లు వస్తున్నాయి. మొత్తానికి నాలుగు దక్షిణాది భాషల్లో మూడింటిలో జైత్రయాత్రకి ఈమె సంసిద్దం అవుతోంది. మరి ఈమె హవా ఎంత కాలం కొనసాగుతుందో వేచిచూడాల్సివుంది...! 

Rashmika Mandanna Busy with Top Movies:

Rashmika Mandanna in Top Heroes films
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs