ఆది సాయికుమార్ హీరోగా.. రైటర్ డైమండ్ రత్నబాబు తొలిసారి దర్శకుడిగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘బుర్రకథ’. దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై హెచ్‌కె.శ్రీకాంత్ దీపాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు మెదళ్లతో పుట్టిన హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనే కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రమిది. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఈ రెస్పాన్స్ కారణంగానే సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్‌ను వింటేజ్ క్రియేషన్స్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. నిర్మాతలు ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ హక్కులు, శాటిలైట్ హక్కులు కూడా అమ్ముడైపోయాయి.
ప్రస్తుతం సినిమా గోవాలో షూటింగ్ జరుగుతుంది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మిస్తీ చక్రవర్తి, నైరా షా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళి కీలక పాత్రధారులు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫన్ రైడర్‌గా అలరించనుంది.
నటీనటులు:
ఆది సాయికుమార్
మిస్తీ చక్రవర్తి
నైరా షా, రాజేంద్ర ప్రసాద్
పోసాని కృష్ణమురళి
పృథ్వీరాజ్
గాయత్రి గుప్తా
అభిమన్యు సింగ్
ఫిష్ వెంకట్
ప్రభాస్ శ్రీను
గీతా సింగ్ తదితరులు
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: డైమండ్ రత్నబాబు
నిర్మాతలు: హెచ్.కె.శ్రీకాంత్ దీపాల
బ్యానర్: దీపాల ఆర్ట్స్
మ్యూజిక్: సాయికార్తీక్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఎడిటర్: ఎం.ఆర్.వర్మ
స్క్రీన్‌ప్లే: ఎస్.కిరణ్, సయ్యద్, ప్రసాద్ కామినేని, సురేష్ ఆరపాటి, దివ్యా భవన్ దిడ్ల
ఆర్ట్: చిన్నా
పాటలు: శివశక్తి ద్త, భాస్కర భట్ల, కె.కె
ఫైట్స్: వెంకట్, సాల్మన్ రాజ్, రియల్ సతీష్
పి.ఆర్.ఒ: వంశీ శేఖర్