Advertisement
Google Ads BL

నాగబాబు ప్లేస్‌లో.. ‘జబర్దస్త్’ జడ్జిపై సస్పెన్స్!

nagababu,jabardasth judge,ali,roja,comedy show,bullithera | నాగబాబు ప్లేస్‌లో.. ‘జబర్దస్త్’ జడ్జిపై సస్పెన్స్!

తెలుగు బుల్లితెరపై వాదోపవాదాలను పక్కనపెడితే ‘జబర్దస్త్’ కామెడీ షో సృష్టిస్తున్న ప్రభంజనం ఏళ్లకు ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. దీనిని ఎవ్వరిని కించపరచని షోగా చూస్తే మాత్రం దాని రేంజే వేరు. ఈ షో ద్వారా ఎందరో యువకమెడియన్లు వెలుగులోకి వస్తున్నారు. వీరికి జనాధరణ, పాపులారీటీ, సినిమాలో అవకాశాలు కూడా తలుపుతడుతున్నాయి. ఈ షోకి మొదటి నుంచి నాగబాబు, రోజాలు జడ్జిలుగా ఉన్నారు. వీరిద్దరు ఎంతో హుందాగా షోని నడుపుతున్నా, వెకిలి చేష్టలు, వెకిలి నవ్వులు నవ్వుతున్నారనే విమర్శ ఉంది.

Advertisement
CJ Advs

ఇక ఎన్నికలలో నాగబాబు జనసేన తరపున, రోజా వైసీపీ తరపున పోటీ చేశారు. నాగబాబు ఓడిపోగా రోజా విజయం సాధించింది. తాను ఎన్నికలలో ఎంపీగా గెలిచినా, ఓడినా జబర్ధస్త్‌ని మాత్రం  వదులుకోనని నాగబాబు స్పష్టం చేశాడు. మరోవైపు రోజా గెలవడం, ఆమె పార్టీ వైసీపీ ఏపీలో విజయదుంధుబి మోగించండంతో ఆమెకి మంత్రి పదవి ఖాయమంటున్నారు. అదే జరిగితే రోజా ఇక ఐదేళ్ల పాటు జబర్థస్త్‌లో కనిపించే ఛాన్స్ ఉండదు. ఇక జబర్ధస్త్ షో నుంచి రోజా, నాగబాబు తాత్కాలికంగా తప్పుకోవడంతో జానీమాస్టర్, మీనా, సంఘవి... ఇలా వరుసగా జడ్జిలు మారుతున్నారు

నాగబాబు మరలా ఈ షోలో పాల్గొనడం ఖాయమని అంటున్న నేపధ్యంలో పవన్‌కి అత్యంత ఆత్మీయుడుగా ఉండి, పొరపొచ్చాల వల్ల వైసీపీలో చేరిన కమెడియన్ అలీని నాగబాబు స్థానంలో తీసుకుంటున్నారని సమాచారం. మల్లెమాల సంస్థ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటుందో వేచిచూడాల్సి ఉంది.

Suspense on Jabardasth Judge Role:

Ali Replaces Nagababu in Jabardasth Judge Place
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs