Advertisement
Google Ads BL

తమిళ ‘బిగ్‌బాస్’లో సంచలన నిర్ణయం!


దక్షిణాదిలో తమిళంలో, తెలుగులో బిగ్ బాస్ రియాల్టీషో దాదాపు అటు ఇటుగా ఒకేసారి ప్రారంభమయ్యాయి. తమిళంలో మొదటి సీజన్‌తో పాటు రెండో సీజన్‌కి కూడా లోకనాయకుడు కమల్ హాసన్ హోస్ట్ చేశాడు. తెలుగులో మాత్రం మొదటి సీజన్‌కి జూనియర్  ఎన్టీఆర్, రెండో సీజన్‌కి నాని హోస్ట్‌లుగా వ్యవహరించారు. తెలుగులో మూడో సీజన్‌కి నాగార్జున హోస్ట్ చేస్తాడని వార్తలు వస్తున్నా ఇంకా అది అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. తమిళంలో మాత్రం ఏ ఇబ్బంది లేకుండా మూడో సీజన్‌కి కూడా కమల్ హాసనే హోస్ట్‌గా అంగీకరించాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలయ్యింది.  ఇప్పుడు తమిళనాట బిగ్ బాస్ గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. దీనికి కారణం తమిళ బిగ్ బాస్ నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించడమే కారణమని చెప్పాలి. మన సమాజంలో ట్రాన్స్ జెండార్స్ని ఇప్పటికీ చులకనగానే చూస్తున్నారు. వారి మీద చిన్నచూపు, వెకిలితనం ఇంకా ఉంటూనే ఉన్నాయి. కానీ అభివ్శద్ది చెందిన దేశాలలో వారికి తగిన గౌరవం అందుతూనే ఉంది. తాజాగా బిగ్ బాస్ లో ఓ ట్రాన్స్ జెండర్కి ప్రవేశం కల్పించనున్నారట. ఇందులో భాగంగా స్వలింగ సంపర్కుడికి ఎంట్రీ ఛాన్స్ ఇవ్వనున్నారు. మరి  అది అతడా? ఆమె? అనే దానిపై క్లారిటీ రాలేదు. ఈ విషయమై నిర్వాహకులు కమల్ని కలిసి వివరించారని, దీనికి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. 

Advertisement
CJ Advs

ఈ షోలో స్వలింగ సంపర్కుడికి చాన్స్ ఇచ్చే విషయంలో కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. హౌస్‌లో స్వలింగసంపర్కుడు ఉంటే మిగిలిన పార్టిసిపెంట్స్ ఎలా ఫీలవుతారు? వారితో ఎలా నడుచుకుంటారు? అలాంటి వారి వల్ల ఎవరైనా షో నుంచి తప్పుకుంటారా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇక తమిళ బిగ్ బాస్ పార్టిసిపెంట్స్‌లో హీరోయిన్ ప్రియా ఆనంద్, రాధా రవి, తిలక్ రమేష్ వంటి హేమాహేమీలు పాల్గొననుండటం విశేషం. ఇలా హౌస్ సభ్యులలో స్వలింగసంపర్కుడు ఉంటే పోటీ రంజుగా మారుతుంది అనడంలో సందేహం లేదు.

Sensational News about Tamil Bigg Boss Season 3:

Transgender in tamil bigg boss
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs