Advertisement
Google Ads BL

సుడిగాలి సుధీర్‌ కాదు.. ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’!


సుడిగాలి సుధీర్‌ హీరోగా శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’

Advertisement
CJ Advs

జబర్దస్త్, ఢీ, పోరా పోవే వంటి సూపర్ హిట్ టెలివిజన్ షోస్ ద్వారా ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా, ‘రాజు గారి గది’ ఫేమ్‌ ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌‌పై ప్రొడక్షన్‌ నెం-1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.  ప్రముఖ నటి ఇంద్రజ, షాయాజీ షిండే, పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ సినిమాను జులై చివరి వారంలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

హీరో సుడిగాలి సుధీర్‌ మాట్లాడుతూ.. ‘‘అందరూ నన్ను హీరో అంటున్నారు.. కానీ ఈ సినిమాకు కథే హీరో. దర్శకుడు ఈ సినిమా కథ చెప్పగానే చాలా ఎక్సయిటింగ్‌‌గా అనిపించింది. ఇప్పటి వరకూ ఆడియన్స్‌ నన్ను తమ పక్కింటి కుర్రాడిగానే పరిగణిస్తారు. ఇంత తక్కువ టైంలోనే వారి ఆదరాభిమానాలు పొందడం నిజంగా నా అదృష్టం. అలాంటిది ఈ సినిమా ద్వారా వారికి మరింత దగ్గర అయ్యే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా మొదటి సినిమాకే ఇంత మంది ప్రముఖ టెక్నిషియన్స్‌తో కలిసి పని చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు.

ప్రొడ్యూసర్‌ కె. శేఖర్‌ రాజు మాట్లాడుతూ.. ‘‘నేను గత 11 సంవత్సరాలుగా యుపీవిసి వ్యాపార రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాను. సినిమా మీద ఉన్న ఫ్యాషన్‌తో మంచి కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలో 6 నెలల క్రితం రాజశేఖర్‌ రెడ్డి నాకు మంచి కథ వినిపించారు. అలాగే ఆయన కోన వెంకట్‌గారి దగ్గర రైటర్‌గాను, హరీష్‌ శంకర్‌, సంపత్‌ నంది దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన అనుభవం ఉండడంతో రాజశేఖర్‌ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌ స్థాపించి ప్రొడక్షన్‌ నెం-1గా ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ సినిమాను నిర్మిస్తున్నాను. ఈ సినిమా ద్వారా సుధీర్‌ని హీరోగా పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటి సినిమా అయినా ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా ఒక మంచి సినిమా ప్రేక్షకులకు అందివ్వాలనే ఉద్దేశ్యంతో ధన్యా బాలకృష్ణ, ఇంద్రజ, పోసాని, షాయాజీ షిండే, శివ ప్రసాద్‌ లాంటి నటీనటులతో గౌతమ్‌ రాజు, రామ్‌ప్రసాద్‌, రామ్‌ లక్ష్మణ్‌, భీమ్స్‌, శేఖర్‌ మాస్టర్‌ లాంటి ప్రముఖ టెక్నీషియన్స్‌ ఈ సినిమాకు వర్క్‌ చేస్తున్నారు. ఇప్పటికే యాభై శాతం టాకీ పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను జులై చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం’’ అన్నారు. 

దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ.. ‘‘మంచి కమర్షియల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. కామెడీతో పాటు కమర్షియల్‌ పంథాలో సాగే ఒక ఇంట్రెస్టింగ్‌ స్టోరీతో మీ ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేటి తరం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల జీవితాల్లో ఉండే కష్టసుఖాలు మా సినిమాలో చూపించడం జరిగింది. మంచి కామెడీ టైమింగ్‌ ఉన్న హీరో కాబట్టి సుధీర్‌ని సెలెక్ట్‌ చేయడం జరిగింది. అలాగే ‘రాజు గారి గది’ ఫేమ్‌ ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. రెండు పాటలు చిత్రీకరణ పూర్తయ్యింది. మిగతా రెండు మోంటేజ్‌ సాంగ్స్‌. భీమ్స్‌ అద్భుతమైన సంగీతంతో పాటు అదిరిపోయే బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇస్తున్నారు. అలాగే రామ్‌ప్రసాద్‌గారి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ మూవీ. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చే చిత్రం అవుతుంది’’ అన్నారు. 

ప్రముఖ నటి ఇంద్రజ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు చెప్పిన సబ్జెక్ట్‌ నాకు బాగా నచ్చింది. అంతకు మించి ఒక మదర్‌ సెంటిమెంట్‌ నన్ను ఈ క్యారెక్టర్‌ చేయడానికి ప్రేరేపించింది. అలాగే దర్శకుడు కూడా సినిమాను చాలా బాగా తెరకెక్కిస్తున్నారు. సుధీర్‌ కామెడీ టైమింగ్‌ గురించి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కూడా తన బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇస్తున్నారు. ఈ సినిమాలో మంచి ఎమోషన్‌ ఉంది. షూటింగ్‌ చాలా ఫన్‌గా జరుగుతోంది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు. 

సుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, షాయాజీ షిండే, శివ ప్రసాద్‌, హేమ, విద్యుల్లేఖ, టార్జాన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: గౌతమ్‌ రాజు, సినిమాటోగ్రఫీ: రామ్‌ప్రసాద్‌, మ్యూజిక్‌ : భీమ్స్‌ సిసిరోలియో, ఫైట్స్‌: రామ్‌ లక్ష్మణ్‌, డాన్స్‌: శేఖర్‌ మాస్టర్‌, పబ్లిసిటీ డిజైనర్‌: ధని ఏలె, ఆర్ట్‌ డైరెక్టర్‌: నారాయణ ముప్పాల, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, పాటలు: సురేష్‌ బనిశెట్టి, ప్రొడ్యూసర్‌: కె. శేఖర్‌ రాజు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల.

Sudigaali Sudheer Turns Software Sudheer:

Sudigaali Sudheer Starrer As Hero, Produced By K Sekhar Raju In Sekhara Art Creations Banner Titled Software Sudheer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs