Advertisement
Google Ads BL

జూన్ 14న తాప్సి ‘గేమ్ ఓవర్’ అంటోంది


‘తాప్సి’ కథానాయికగా ‘గేమ్ ఓవర్’ సెన్సార్ పూర్తి.. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 14 న విడుదల 

Advertisement
CJ Advs

ప్రముఖ కథానాయిక ‘తాప్సి’ ప్రధాన పాత్రలో ‘గేమ్ ఓవర్’ పేరుతో  ప్రముఖ తెలుగు, తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ ‘వై నాట్ స్థూడియోస్’ నిర్మిస్తున్న చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యుబైఎ సర్టిఫికెట్‌ను పొందింది. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 14‌న విడుదల అవుతోందని చిత్ర నిర్మాతలు ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర తెలిపారు. గతంలో ఈ సంస్థ సిద్ధార్ధ్ కథానాయకునిగా రూపొందిన ‘లవ్ ఫెయిల్యూర్’ (2012), విక్టరీ వెంకటేష్ కథానాయకునిగా రూపొందిన ‘గురు’ (2017) వంటి ఘన విజయం సాధించిన చిత్రాలను నిర్మించిన విషయం విదితమే. ఇప్పుడు తమ మరో ప్రయత్నంగా తాప్సి ప్రధాన పాత్రలో ఈ ‘గేమ్ ఓవర్’ను నిర్మించటం సంతోషంగా ఉందని అన్నారు నిర్మాత ఎస్.శశికాంత్. ఓ సరికొత్త కధ, కథనాలతో తెలుగు,తమిళ భాషలలో రూపొందిన ఈ చిత్రం తమ గత చిత్రాలు ‘లవ్ ఫెయిల్యూర్’, ‘గురు’ విజయాల సరసన నిలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ‘నయనతార’ కథానాయికగా తమిళ నాట ఘనవిజయం సాధించిన ‘మయూరి’ వంటి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ‘అశ్విన్ శరవణన్’ దర్శకత్వంలో ఈ ‘గేమ్ ఓవర్’  చిత్రం రూపొందింది.

కథానాయిక తాప్సి మాట్లాడుతూ.. ‘గేమ్ ఓవర్’ చిత్రం కథ విన్నప్పుడే సరికొత్తగా ఉందని అనిపించింది. విజయం సాధించే చిత్రం అనిపించింది. ‘ఆనందో బ్రహ్మ’ తరువాత నా చిత్రాలపై ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ చిత్రం వమ్ము చేయదని అన్నారు. 

దర్శకుడు ‘అశ్విన్ శరవణన్’ మాట్లాడుతూ... ‘గేమ్ ఓవర్’  చిత్రం తెలుగు ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని అన్నారు. 

Game Over Censor Completed.. and Ready to Release:

“Game Over” Telugu certified  UA. Worldwide release on June 14th 2019.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs