నేటిరోజుల్లోమహిళలు ప్రతి విషయంలోనూ ముందుంటున్నారు. వారు చేయలేని పని అంటూ ఏమీ లేదు. ఈ పురుషాధిక్య ప్రపంచంలో వారు మగధీరులకు పోటీగా అన్ని రంగాలలో సత్తా చాటుతున్నారు. ఇక విషయానికి వస్తే కింగ్ నాగార్జున మెయిన్‌టెయిన్ చేసే ఫిట్‌నెస్ మరెవ్వరికీ సాధ్యం కాదేమో అని అనిపిస్తుంది. అందుకే షష్టిపూర్తి వయసులో కూడా ఆయన మూడు పదుల హీరోలా అనిపిస్తాడు. తాను సొంతగా వండుకున్న వంటలనే తినడం, పోర్చుగల్ వంటి దేశాలకు షూటింగ్ పని మీద వెళ్లి, అక్కడ జిమ్ వసతులు లేకపోతే ఏకంగా చెట్లుపుట్టలతో స్ట్రెచింగ్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. ఈ విషయంలో ఆయన కోడలు సమంతా తన మావయ్యకు సవాల్ విసురుతోంది.
తాజాగా ఆమె సోషల్‌మీడియాలో విడుదల చేసిన ఫొటోలను చూస్తే ఎంతటి మగధీరులైనా ఆశ్యర్యపోయి గుడ్లు తేలేయాల్సిందే. ఆమె జిమ్‌లో ఏకంగా 100 కిలోల ఐరన్‌డ్రమ్స్‌ని అవలీలగా ఎత్తేస్తోంది. అంత బరువు ఆమె మోయడం చూస్తే మగవారికి, బాడీ బిల్డర్స్‌కి కూడా ముచ్చెమటలు పట్టడం ఖాయమనే చెప్పాలి. సాధారణంగా మగాళ్లకే సిక్స్‌ప్యాక్‌లు, ఇలాంటి కఠోర జిమ్‌లంటే భయం. కానీ వాటిని సమంత తాను చేసి చూపిస్తోంది.
అయితే ఆమె తాజాగా విడుదల చేసిన ఫొటో కేవలం ఓ శాంపిల్ మాత్రమేనని, ఇలా ఆమె చేసే విన్యాసాలు అన్నింటిని చూస్తే గుండె ఆగిపోవడమే, పురుష పుంగవులు సిగ్గుతో తలదించుకోవడమో ఖాయమని అంటున్నారు. ఇలా సమంత వర్కౌట్స్ చూసిన వారు ‘బీస్ట్.. ఐరన్‌లేడీ, పవర్‌ఉమెన్’ వంటి బిరుదులతో సమంతను తెగపొగుడుతున్నారు. నిజానికి ఈ పొగడ్తలన్నీ సమంత చేస్తోన్న ఫీట్స్ ముందు దిగదుడుపేనని చెప్పాలి. మరికొందరు మాత్రం సమంతతో పోలిస్తే ఈ విషయంలో ఆమె భర్త నాగచైతన్య స్థాయి తక్కువేనని, ఇద్దరికీ పోటీ పెడితే ఏకపక్షంగా సమంత గెలవడం ఖాయమంటున్నారు.