Advertisement
Google Ads BL

‘స్వేచ్ఛ’ ఏ దశలో ఉందంటే...!!


రాయనపాటి లక్ష్మి కుమారి సమర్పణలో “చేర్రిస్ ఎంటర్టైన్మెంట్” బ్యానర్ పై ప్రముఖ సింగర్ మంగ్లి ప్రధాన పాత్రలో కె.పి.ఏన్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “స్వేఛ్చ”. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ దశలో ఉంది. ఈ చిత్రానికి నిర్మాత “సతీష్ నాయుడు”.

Advertisement
CJ Advs

ఈ సంధర్బంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ మా ఈ చిత్రం పాపికొండలు, నర్సాపూర్, అశ్వారావు పేట, పాల్వంచ తదితర అందమైన లొకేషన్స్ లో చిత్ర షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రానికి చాలా అందమైన ఫోటోగ్రఫి అందించిన విజయ టాగూరు మరియు సతీష్ వేములపూడి  గార్లకు, చక్కని మ్యూజిక్ సమకూర్చిన భోలే షావలి గార్కి మా కృతజ్ఞతలు. ప్రస్తుతం సెన్సార్ పనుల్లో ఉంది, సెన్సార్ పూర్తి కాగానే జూన్ రెండో వారంలో చిత్రం రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నాము. 

దర్శకుడు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంత ముఖ్యమో,  ఈ సృష్టికి ఆడపిల్ల అంతే ముఖ్యమనే కథాంశంతో పాటు చక్కని లవ్ సెంటిమెంట్ తో ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించటం జరిగింది. ఇందులో ప్రధాన పాత్రధారిణి మంగ్లితో పాటు చమ్మక్ చంద్ర, మాష్టర్ చక్రి, యోధ, భోలే, చౌహాన్, జాకీ, తదితర నటీనటులు చాలా బాగా నటించారు. మంచి కథ, కథనం, పాటలు, మాటలు అన్నీ కలిపి ఈ స్వేఛ్చ మీ అందరిని అలరిస్తుందని ఆశిస్తున్నాము అని తెలిపారు.   

Swechha Movie Latest Update:

Swechha ready to Censor
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs