Advertisement
Google Ads BL

బన్నీ చెల్లెలిగా చేయట్లేదు: యంగ్ హీరోయిన్


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా గ్యాప్ తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాలో బన్నీ సరసన మరోసారి పూజా హెగ్డే నటిస్తుంది. అలానే బన్నీ తల్లి పాత్రలో సీనియర్ హాట్ హీరోయిన్ ‘టబు’ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
CJ Advs

మూవీలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రకి కూడా చాలా ప్రాధాన్యత వుంటుందట. సో అందుకే ఆ పాత్ర కోసం నివేదా థామస్ ను ఎంపిక చేశారనే టాక్ వినిపించింది. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కాబట్టి నివేదా థామస్ ఈ పాత్రను చేయడానికి అంగీకరించిందని చెప్పుకున్నారు. 

అయితే ఈ రూమర్ రోజురోజుకి ముదిరిపోవడంతో లేటెస్ట్ గా నివేదా థామస్ స్పందించింది. ఇప్పటివరకు ఈమూవీ కోసం తనని ఎవరూ సంప్రదించలేదనీ, ఈ సినిమాలో తను చెల్లెలి పాత్రను చేయనున్నాననే వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. దాంతో నివేదా థామస్ తనపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టినట్టైంది. మరి బన్నీ చెల్లిగా ఎవరు నటిస్తారో చూడాలి.

Nivetha Thomas Clarity on Rumours on Her:

Nivetha Thomas not Played Allu Arjun Sister Role
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs