Advertisement
Google Ads BL

కాజల్, తమన్నాల మధ్యనే ఫైట్..!


మే31న ‘ఎన్జీకే, అభినేత్రి 2’ చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాలూ హీరోయిన్‌ డామినేషన్‌తో నిండినవిగా అనిపిస్తున్నాయి. ‘దేవి’కి సీక్వెల్‌గా వస్తున్న ‘అభినేత్రి 2’ చిత్రం భారాన్ని మొత్తం తమన్నానే మోస్తోంది. ప్రభుదేవాకి తెలుగులో కూడా క్రేజ్‌ ఉన్నా ఈ చిత్రం ప్రొమోస్‌, ట్రైలర్స్‌, సాంగ్స్‌లో హీరోయిన్‌ తమన్నాకే పెద్ద పీట వేస్తున్నారు. ఇక ఈ చిత్ర దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌కి తెలుగులో పెద్దగా గుర్తింపు లేదు. దాంతో ‘అభినేత్రి 2’ పూర్తి బాధ్యతలను తమన్నాపైనే మోపారు. 

Advertisement
CJ Advs

ఇక మే24న విడుదల కానున్న మరో చిత్రం ‘సీత’, తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా కాజల్‌ అగర్వాల్‌ ‘సీత’గా టైటిల్‌ రోల్‌ని పోషించిన ఈ చిత్రం ప్రోమోలు, ట్రైలర్స్‌లో కూడా సీత డామినేషన్‌ కనిపిస్తోంది. ఇంతకాలం మాస్‌ హీరోగా, సోలో హీరోగా స్టార్‌ అనిపించుకోవాలని ఆశించిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ తన నిర్ణయాన్ని మార్చుకుని మరీ ‘సీత’ చిత్రంలో నటిస్తున్నాడు. ముఖ్యంగా కాజల్‌ని హైలైట్‌ చేస్తూ విడుదల చేసిన తాజా ట్రైలర్‌ మరింత ఆసక్తిని రేపుతోంది. ఓ గూండాని కాజల్‌ కాలు ఎత్తి కొట్టే సీన్‌ బాగా వైరల్‌ అవుతోంది. 

మరోవైపు ఈ చిత్రం సోలో రిలీజ్‌ కారణంగా కాస్త అటెన్షన్‌ని సాధిస్తోంది. నిఖిల్‌ ‘అర్జున్‌సురవరం’ వాయిదా పడటం, ‘మహర్షి’ దూకుడు తగ్గటం, ‘ఎబిసిడి’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విడుదల కావడం వంటివి ‘సీత’కి ప్లస్‌ పాయింట్స్‌గా నిలుస్తున్నాయి. ఈ చిత్రం విడుదలైన వారం దాకా మరో చిత్రం పోటీలో లేదు. మే31న ఎన్జీకే వచ్చే వరకు బాక్సాఫీస్‌ వద్ద ‘సీత’ సత్తా చాటుతుందా? తనకి లభించిన సోలో రిలీజ్‌ని క్యాష్‌ చేసుకుంటుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది....! 

Heroines Ruled Tollywood Box Office:

Kajal and Tamanna Acted Films Release in This Week
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs