Advertisement
Google Ads BL

సమంత పవర్‌ఫుల్‌ ఉమెన్: రకుల్


రకుల్‌ప్రీత్‌సింగ్‌.. ఈ పేరు తెలుగు సినీ ప్రేమికులకు తెలియని వారుండరు. ఈమె అతి తక్కువ కాలంలోనే పైకెదిగి తనతోపాటు సినిరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లను సైతం డామినేట్‌ చేసి యంగ్‌స్టార్స్‌ అందరితో జోడీ కట్టింది. ఒకరిద్దరితో రెండు సార్లు కూడా కలిసి నటించింది. ఇక ఈమె బాలీవుడ్‌లో చేసిన ‘అయ్యారే’ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకుంది. కానీ విజయం దక్కలేదు. తాజాగా ఆమె అజయ్‌ దేవగణ్‌కి జోడీగా ‘దే దే ప్యార్‌దే’లో నటించింది. మొదటి రోజున ఈ చిత్రం కలెక్షన్లు తీవ్ర నిరాశకు గురి చేశాయి. కానీ రెండో రోజు కల్లా పూర్తిగా కోలుకుని 50కోట్ల క్లబ్‌లో చేరింది. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం ఈమె నాగార్జున హీరోగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శక్వంలో రూపొందుతున్న ‘మన్మథుడు 2’లో నాగ్‌కి జోడీగా నటిస్తోంది. ఇక ఈమె సూర్య సరసన నటించిన ‘ఎన్జీకే’ చిత్రం 31న విడుదల కానుంది. ఇక తాజాగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ ‘దే దే ప్యార్‌దే’ చిత్రం ప్రమోషన్లలో భాగంగా సోషల్‌మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఇందులో భాగంగా ఆమె హీరోయిన్‌ సమంత గురించి ఓ ఆసక్తికర కామెంట్‌ చేసింది. 

ఓ అభిమాని మీకు తోటి హీరోయిన్స్‌లో ఎవరు ఇష్టం? వారితో మీ సంబంధాలు ఎలా ఉంటాయి? అని ప్రశ్నించాడు. దానికి రకుల్‌ సమాధానం ఇస్తూ, సమంత అంటే నాకు చాలా ఇష్టం. ఆమె పవర్‌ఫుల్‌ ఉమెన్‌. ఆమెతో నేను ఎంతో సన్నిహితంగా ఉంటానని తెలిపింది. బహుశా ఈమధ్య ‘మన్మథుడు 2’ కోసం పోర్చుగల్‌లో జరిగిన షెడ్యూల్‌లో పాల్గొన్న రకుల్‌, సమంతల మధ్య మంచి స్నేహం కుదిరినట్లే ఉంది...! ఈ సందర్భంగా రకుల్‌, నాగార్జున, దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌లపై కూడా ప్రశంసల వర్షం కురిపించింది. 

Rakul Preet singh Praises Samantha:

Samantha is Powerful Woman says Rakul Preet Singh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs