Advertisement
Google Ads BL

‘ఇద్దరిలోకం ఒకటే’ ఆ తరహా చిత్రమా!


దర్శకుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చి ‘ఉయ్యాల జంపాల’లతో హీరో అయ్యాడు రాజ్‌తరుణ్‌. ఆ తర్వాత ‘సినిమా చూపిస్తమావా, కుమారి 21ఎఫ్‌’లతో హిట్స్‌ కొట్టాడు. ‘ఈడో రకం.. ఆడో రకం’తో ఫర్వాలేదనిపించుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆయన డౌన్‌ఫాల్‌ మొదలైంది. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు, రంగుల రాట్నం, రాజుగాడు, లవర్‌’ వంటి చిత్రాలలో నటించాడు. అన్నపూర్ణ బేనర్‌తో పాటు దిల్‌రాజు కూడా ఈయనకు హిట్‌ ఇవ్వలేకపోయాడు. తాజాగా ఆయన దిల్‌రాజు దర్శకత్వంలో మరో చిత్రం ఒప్పుకున్నాడు. ఒకవిధంగా ఈ కొత్త చిత్రం రాజ్‌తరుణ్‌ కెరీర్‌కి చావో రేవో అన్నట్లుగా తయారైంది. ఈ సారి ఏడాది పాటు భారీ గ్యాప్‌ తీసుకుని ఆయన విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. 

Advertisement
CJ Advs

నితిన్‌ నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్ర దర్శకుడు విజయ్‌కుమార్‌ కొండా దీనికి దర్శకుడు. విజయ్‌కుమార్‌ కూడా నితిన్‌తో మొదటి చిత్రం హిట్‌ ఇచ్చినా నాగచైతన్య, పూజాహెగ్డేలతో తీసిన ‘ఒక లైలా కోసం’ చిత్రం ఫ్లాప్‌ అయింది. దీంతో ఈయన కూడా భారీ గ్యాప్‌ తరువాత దిల్‌రాజు బేనర్‌లో రాజ్‌తరుణ్‌తో ఓ చిత్రం చేయనుండటం విశేషం. మధ్యలో విజయ్‌కుమార్‌ కొండా కొన్ని వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొన్నాడు. తాజాగా ఈ చిత్రం ద్వారా గాడిలో పడాలని చూస్తున్నాడు. ఇక ఈమూవీకి ‘ఇద్దరిలోకం ఒకటే’ అనే టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు. ఈ మూవీ మెయిన్‌ పాయింట్‌ విషయంలో ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. తనకంటే వయసులో పెద్దదయిన అమ్మాయి ప్రేమలో తక్కువ వయసు ఉన్న హీరో ప్రేమలో పడటం అనేది మెయిన్‌ పాయింట్‌గా తీసుకున్నాడు. 

సచిన్‌ టెండూల్కర్‌ నుంచి ఎందరో తమకంటే వయసులో పెద్ద ఉన్న వారిని వివాహం చేసుకున్నాడు. ఇక అప్పుడెప్పుడో వీరూ.కె. దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం ‘ఆరోప్రాణం’ కూడా ఇదే పాయింట్‌తో రూపొందింది. ఇందులో వయసు ఎక్కువ ఉన్న హీరోయిన్‌గా సౌందర్య, వయసులో చిన్నవాడైన హీరోగా వినీత్‌ నటించారు. ఇక రాజ్‌తరుణ్‌ చిత్రంలో ఆయన కంటే కాస్త పెద్ద వయసు హీరోయిన్‌గా నిత్యామీనన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. 

Raj Tarun Iddari Lokam Okate Film Story Line:

Raj Tarun Movie Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs