Advertisement
Google Ads BL

ఈ హీరో.. సైలెంట్‌గా షాకిచ్చాడుగా..!


ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాకు ప్రమోషన్స్ ఎంత కీలకమో మన అందరికి తెలిసిందే. సినిమా యొక్క ప్రమోషన్స్ ఎంత బాగా చేస్తే ఆ స్థాయిలో సినిమా ఆడుతుంది. సినిమా ఓపెనింగ్ దగ్గర నుండి రిలీజ్ మూడు వారాలు పై దాకా ఆడేవరకు ఏదో ఒకరకంగా మీడియాలో నానితే తప్ప జనం గుర్తుపెట్టుకోలేని పరిస్థితి ఉంది.

Advertisement
CJ Advs

అందుకే సినిమాలకు ప్రమోషన్స్ చాలా కీలకంగా మారాయి. కానీ ఎటువంటి హడావిడి లేకుండా ఏ అప్ డేట్ ఇవ్వకుండ అడవి శేష్ ఓ మూవీ పూర్తి చేశాడు. పీవీపీ నిర్మిస్తున్న ఈ సినిమాలో రెజినా హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఒక థ్రిల్లర్ అని చెబుతున్నారు. కాస్టింగ్ తక్కువగా ఉండడంతో పైగా థ్రిల్లర్ కావడంతో చకచకా తీసేసారు.

అయితే ఇలా ఎటువంటి చప్పుడు లేకుండా సినిమాను కంప్లీట్ చేయాలనీ ముందే అనుకున్నారట. ఫస్ట్ లుక్ తో పాటు మిగిలిన వివరాలు ప్రకటించే విధంగా ముందే ప్లాన్ చేసుకున్నారట. మరో రెండు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ చేస్తారట. ఈసినిమా కన్నా ముందే అడివి శేష్ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నాడు. గత ఏడాది తనకు మంచి సక్సెస్ ఇచ్చిన గూడచారి సీక్వెల్ తో పాటు మహేష్ బాబు సోనీ సంస్థల సంయుక్త నిర్మాణంలో మేజర్ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఇవి షూటింగ్ దశలో ఉన్నాయి. అది మ్యాటర్.

Adivi Sesh Film Shoot Completed Silently:

Adivi Sesh and PVP film Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs