Advertisement
Google Ads BL

చిల్‌ అంటోన్న ‘మన్మథుడు’!


కింగ్‌ నాగార్జున.. ఈయన 60ఏళ్ల వయసులో కూడా యువ హీరోలకు, చివరకు యంగ్‌స్టార్స్‌, తన కుమారుల కంటే గ్లామర్‌గా కనిపిస్తూ ఉంటాడు. ఫిట్నెస్‌ విషయంలో ఈయనను మించిన వారు టాలీవుడ్‌లో లేరనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన తన కెరీర్‌లో క్లాసిక్‌ మూవీగా నిలిచిన ‘మన్మథుడు 2’ చేస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం పోర్చుగల్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విడుదలైన ఓ ఫొటోలో నాగార్జున అచ్చు గోల్ఫ్‌ప్లేయర్లని మించిన క్లాసీ లుక్‌తో కేకపుట్టిస్తున్నాడు. మరోవైపు ఆయన పోర్చుగల్‌లో తన కోడలుపిల్ల సమంతతో కలిసి ‘మన్మథుడు 2’లో నటించాడు. 

Advertisement
CJ Advs

ఈ చిత్రం యూనిట్‌ హైదరాబాద్‌కి వచ్చిన సందర్భంగా నాగార్జున తన అనుభూతులను ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కోడలమ్మ సమంతతో తాను దిగిన ఫొటోని పోస్ట్‌ చేసిన ఆయన ‘కోడలిపిల్లతో షూటింగ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. షూటింగ్‌ చాలా సరదాగా సాగిపోయింది. త్వరలోనే మరికొన్ని ఫొటోలను ట్వీట్‌ చేస్తానని తెలిపాడు. ఇక నాగచైతన్యతో, సమంతకి వివాహానికి ముందు ‘మనం’ వంటి క్లాసిక్‌లో సమంత, నాగచైతన్యతో కలిసి నటించింది. ఆ తర్వాత వారి వివాహం జరిగిన తర్వాత కూడా ‘రాజు గారి గది2’లో యాక్ట్‌ చేసింది. 

ఇక నాగ్‌ విడుదల చేసిన ఫొటోలో ఓ గొడుగును నాగార్జునపై ఎండ పడకుండా సమంత గొడుగు పట్టుకున్న స్టిల్‌లో వారిద్దరు నవ్వుల్లో మునిగితేలుతున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్‌ మెయిన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో ‘కీర్తిసురేష్‌, సమంత’లు కామియో పాత్రలను పోషిస్తున్నా కూడా ఈ ఇద్దరి పాత్రలు సినిమాకి ఎంతో ముఖ్యమని చెబుతున్నారు. ఆగష్టులో విడుదలకు ప్లాన్‌ చేస్తోన్న ఈ చిత్రానికి ‘చిలసౌ’ వంటి ఒకే ఒక్క సినిమా దర్శకునిగా అనుభవం ఉన్న రాహుల్‌రవీంద్రన్‌ డైరెక్టర్‌. ఇక ఇందులో కన్నడ నటి అక్షరగౌడ్‌ కూడా కీలకపాత్రను పోషిస్తోంది.

Nagarjuna Shares Happy Movements at Manmadhudu 2 Shoot:

Samantha acted in Manmadhudu 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs