మాస్టర్ ఎన్. టి. రామ్ చరణ్ సమర్పణలో 7 వండర్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తేజ, హరిణి రెడ్డి హీరో హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘డ్రీమ్ బాయ్’. రాజేష్ కనపర్తి ఈ చిత్రానికి దర్శకుడు కాగా.. రేణుక నరేంద్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ డ్రీమ్ బాయ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్బంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ.. స్టోరీకు తగ్గ కాస్టింగ్ ను ఎంపిక చేసుకున్నాం. ప్రస్తుతం ఈ చిత్రం టాకీ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కంటెంట్ ఉన్న చిత్రం ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా అన్నారు.
హీరో తేజ మాట్లాడుతూ... ఇది నా ఫస్ట్ ఫిల్మ్. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతఙ్ఞతలు. మంచి కంటెంట్ ఉన్న చిత్రంతో పరిచయం అవుతున్నందుకు మరియు సూర్య, హేమ, ధనరాజ్ లాంటి సీనియర్ నటులతో కలసి వర్క్ చేసే అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఉంది అన్నారు. ఇందులో 4 పాటలు ఉన్నాయి. రికార్డింగ్ అయిపోయాయి. సాంగ్స్ షూట్ మిగిలిఉంది. త్వరలో వైజాగ్ లో ప్లాన్ చేస్తున్నామని మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ తెలిపారు.
ఈ చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వీరబాబు మాట్లాడుతూ.. మా ప్రొడ్యూసర్ రేణుక నరేంద్ర గారు ఇంపార్టెంట్ పని ఉండడం వలన ఈ సమావేశానికి రాలేకపోయారు. మంచి కథను తెరకెక్కిస్తున్నాడు రాజేష్. షూటింగ్ పూర్తి అయింది. సాంగ్స్ ఉన్నాయి అవి వైజాగ్ లో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం.. మిగతా అన్నీ పనులు త్వరలో పూర్తి చేసుకొని జులై నెలలో సినిమాను విడుదల చేయనున్నామని తెలిపారు.
తేజ, హరిణి రెడ్డి, సూర్య, హేమ, ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, రాకింగ్ రాకేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: నాని-సుభాష్ బొంతు, లిరిక్స్: శ్రీరామ్ తపస్వి, యాక్షన్: క్రాంతి, స్క్రిప్ట్ అసోసియేటె: గంత శ్రీనివాస్, ఎడిటర్: బస్వ పైడి రెడ్డి, మ్యూజిక్: సుభాష్ ఆనంద్, నిర్మాత: రేణుక నరేంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి. వీరబాబు, కథ-డైరెక్షన్: రాజేష్ కనపర్తి.