తెలుగులో మోస్ట్ పవర్ ఫుల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ ఫిలిం RRR చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు. దీనిని దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడు. దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో దానయ్య నిర్మిస్తున్నారు. అయితే ఈమూవీ మళ్లీ సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది.
ఈ మూవీ యొక్క మూడో షెడ్యూల్‌ని ఉత్తరభారతంలోని గుజరాత్, మహారాష్ట్రాలోని కొన్ని ప్రదేశాలలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. అయితే షూటింగ్ సమయంలో ఇద్దరు హీరోస్ కి గాయాలు అవ్వడంతో కొన్ని రోజులు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. రీసెంట్‌గా ఇద్దరు హీరోలు పూర్తిగా కోలుకోవడంతో షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్ధం అవుతున్నారు.
మూడవ షెడ్యూల్‌లో భాగంగా హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్‌లో షూటింగ్ కి సన్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్. ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్‌లతో పాటు హీరోయిన్ అలియా భట్ కూడా పాల్గొనబోతున్నారట. అలియా.. రామ్ చరణ్‌కి జోడిగా కనిపించనుంది. ఇక ఎన్టీఆర్‌కి హీరోయిన్‌గా హాలీవుడ్ అమ్మాయిని తీసుకున్నారు కానీ ఆమె కొన్ని కారణాలు వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో వేరే హీరోయిన్‌ని వెతికే పనిలో ఉన్నారు టీం. ఇక ఈమూవీ టైటిల్ RRR అంటే ‘రామ రావణ రాజ్యం’, ‘రఘుపతి రాఘవ రాజారామ్’ అని అనుకుంటున్నారు చాలామంది ప్రేక్షకులు.