Advertisement
Google Ads BL

‘విశ్వామిత్ర’ విడుదలకు అన్నీ రెడీ


అనగనగా ఓ సాధారణ మధ్యతరగతి అమ్మాయి. జీవితం సంతోషంగా, సాఫీగా సాగుతుందన్న సమయంలో సమస్యలు ఆమెను చుట్టుముడతాయి. వాటిని ఓ అజ్ఞాత వ్యక్తి పరిష్కరిస్తారు. అతడు ఎవరు? ఆమె కథలో మనిషి మేథస్సుకు అందని సృష్టి రహస్యాలు ఏంటి? అనేది సినిమా చూసి తెలుసుకోమంటున్నారు రాజకిరణ్. ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘విశ్వామిత్ర’.

Advertisement
CJ Advs

ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్, రాజకిరణ్ నిర్మిస్తున్న సినిమా ‘విశ్వామిత్ర’. నందితారాజ్, ‘సత్యం’ రాజేష్ జంటగా నటించారు. అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ‘గీతాంజలి’, ‘త్రిపుర’ వంటి థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన రాజకిరణ్ దర్శకత్వం వహించారు. ఇటీవల సినిమా సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికేట్ లభించింది. జూన్ 14న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శక, నిర్మాత రాజకిరణ్ మాట్లాడుతూ.. ‘‘సినిమా చూశాక సెన్సార్ సభ్యులు బావుందని మెచ్చుకున్నారు. సెన్సార్ బృందం ప్రశంసలు మా చిత్రబృందంలో సినిమాపై నమ్మకాన్ని మరింత పెంచాయి. ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే అని చెప్పే ప్రయత్నమే ‘విశ్వామిత్ర’. మధ్యతరగతి అమ్మాయిగా నందిత, ఆమెకు సహాయం చేసే వ్యక్తి పాత్రలో ‘సత్యం’ రాజేష్, నందిత బాస్‌గా అశుతోష్ రాణా, నందిత స్నేహితుడిగా తమిళ నటుడు ప్రసన్న నటించారు. ఆల్రెడీ సినిమా బిజినెస్ పూర్తయింది. అలాగే, సినిమా హిందీ, తెలుగు శాటిలైట్ హక్కులను ప్రముఖ ఛానల్ ‘జీ తెలుగు’ మంచి ఫ్యాన్సీ రేటుకు  సొంతం చేసుకుంది. లవ్ థ్రిల్లర్  జానర్ లో, వాస్తవ ఘటనల ఆధారంగా... ‘గీతాంజలి’, ‘త్రిపుర’ తరహాలో థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రూపొందించాం. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా’’ అన్నారు. 

విద్యుల్లేఖ రామన్, చమ్మక్ చంద్ర, ‘కార్టూనిస్ట్’ మల్లిక్, జీవా, రాకెట్ రాఘవ, సి.వి.ఎల్ నరసింహారావు, ఇందు ఆనంద్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మాటలు: వంశీకృష్ణ ఆకెళ్ళ, ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, ఎడిటర్: ఉపేంద్ర, మ్యూజిక్: అనూప్ రూబెన్స్, యాక్షన్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: సుచిత్ర - భాను, ఆర్ట్: చిన్నా, కో-డైరెక్టర్: విజయ్ చుక్కా,  పి.ఆర్.ఓ: సురేంద్ర కుమార్ నాయుడు - ఫణి కందుకూరి, నిర్మాతలు: మాధవి అద్దంకి, రజనీకాంత్, రాజకిరణ్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాజకిరణ్

Vishwamitra Ready to Release:

Vishwamitra censor completed and Release on June 14th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs