మెగా హీరోస్ లో ఇప్పుడు వరకు సరైన హిట్ దొరకక నానా కష్టాలు పడుతున్న అల్లు శిరీష్ రీసెంట్ గా ‘ఎబిసిడి’ అంటూ మన ముందుకి వచ్చాడు. ఇది ప్లాప్ గా నిలిచింది. కానీ శిరీష్ జయాపజయాలతో సంబంధం లేకుండా, వెంటనే మరో సినిమాని పట్టాలెక్కించడానికి రెడీ అయ్యాడు. అది కూడా ఓ ప్లాప్ డైరెక్టర్ తో.
అవును అల్లు శిరీష్ నెక్స్ట్ ప్రేమ్ సాయి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అసలు ఈ ప్రేమ్ సాయి ఎవరు అంటారా? నితిన్ తో ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ తీసిన వ్యక్తి. అసలు ఈ సినిమా ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారా? మీరు అలా అనుకోవడంలో తప్పు లేదులెండి. అసలు ఈమూవీ వచ్చినట్టు ఎవరికి తెలియదు.
చాలాకాలం నుండి ప్రేమ్ ఓ స్క్రిప్టు పట్టుకుని తిరుగుతున్నాడు. చివరికి గీత ఆర్ట్స్ వాళ్లు ప్రేమ్ కు అవకాశం ఇచ్చారు. ఇక అప్పటి నుండి ఈయన ఆ కథపైనే కసరత్తులు చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అవ్వడంతో శిరీష్ వెంటనే లేట్ చేయకుండా ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్లాలని చూస్తున్నాడు. ఇక మనోడి పక్కన ప్లాప్ హీరోయిన్ నటించబోతుంది. ఆమె ఎవరో కాదు ‘సవ్యసాచి’, ‘మజ్ను’ చిత్రాల నాయిక నిధి అగర్వాల్. మరి ఈ కాంబినేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.