Advertisement
Google Ads BL

‘జెర్సీ’కి 8, ‘కాంచన3’కి 10..!!


కొరియోగ్రాఫర్‌గా, ప్రత్యేక నృత్యాల ద్వారా వెండితెరపై కనిపించే రాఘవలారెన్స్‌ని బహుముఖ ప్రజ్ఞాశాలి అనడంలో అతిశయోక్తి లేదు. టాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ నాగార్జున ప్రోత్సాహంతో ఈయన నటునిగా, దర్శకునిగా ‘మాస్‌, డాన్‌’ చిత్రాలు తీశాడు. ఇక లగడపాటి శ్రీధర్‌ నిర్మాణంలో నృత్యప్రధాన చిత్రంగా ప్రభుదేవాతో కలిసి ‘స్టైల్‌’ చిత్రంలో హీరోగా, దర్శకునిగా రాణించాడు. కానీ తర్వాత ప్రభాస్‌తో తీసిన ‘రెబెల్‌’ మాత్రం డిజాస్టర్‌ అయింది. కానీ ఆ తర్వాత ఆయనే దర్శకత్వం వహిస్తూ ‘ముని’ సిరీస్‌ని ప్రారంభించాడు. అందులో తానే నటిస్తూ వచ్చాడు. ‘ముని, కాంచన, కాంచన 2’లు హర్రర్‌ కామెడీ చిత్రాల ట్రెండ్‌కి దక్షిణాదిలో మరలా శ్రీకారం చుట్టాయి. ఈ మూడు చిత్రాలు తమిళంలోనే గాక తెలుగులో కూడా వీటిని విడుదల చేసిన బెల్లంకొండ సురేష్‌ వంటి వారికి కాసుల వర్షం కురిపించాయి. ముఖ్యంగా బి,సి సెంటర్ల ఆడియన్స్‌ చేత సెహభాష్‌ అనిపించుకుంటూ కలెక్షన్లు కొల్లగొట్టాయి. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా ఆయన నుంచి ‘కాంచన 3’ వచ్చింది. ఈ చిత్రానికి మొదటి రోజు పూర్తిగా నెగటివ్‌టాక్‌ వచ్చింది. తనగత చిత్రాల తరహాలనే కథ, కథనాలు ఉన్నాయని, ఏమాత్రం కొత్తదనం లేదని, చిత్రం డిజాస్టర్‌ కావడం ఖాయమని అందరు భావించారు. మరోవైపు అదే రోజున వచ్చిన నాని ‘జెర్సీ’ చిత్రానికి యునానిమస్‌ పాజిటివ్‌, హిట్‌ టాక్‌ వచ్చింది. దాంతో ‘జెర్సీ’ ముందు ‘కాంచన 3’ నిలబడటం అసాధ్యమనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ చిత్రం కూడా మాస్‌ ఆడియన్స్‌కి ఎంతగానో మెప్పించడమే కాదు.. ‘జెర్సీ’ కలెక్షన్లకు బి,సి సెంటర్లలో 70శాతం వరకు గండికొట్టింది. ఈ చిత్రం విడుదలై 100కోట్ల క్లబ్‌ని చేరిన ఈ చిత్రం నాలుగు వారాల స్టడీ కలెక్షన్లతో లాభాల పంట పండించింది. 

ఈ చిత్రాన్ని తెలుగులో ఠాగూర్‌ మధు విడుదల చేశాడు. ఫుల్‌రన్‌ పూర్తయ్యే సమయానికి ఈ చిత్రం నిర్మాతకు 10కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. అదే యునానిమస్‌ హిట్‌ టాక్‌, క్లాసిక్‌ మూవీగా ప్రశంసలు పొందిన ‘జెర్సీ’ మాత్రం 8కోట్ల లాభాలనే సాధించడం గమనార్హం. నెగటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం ఖర్చులన్నీపోను 10కోట్ల లాభాలు సంపాదించి పెట్టడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌ అయింది. 

Kanchana 3 beats Jersey in Profits:

8 Crore Profit to Jersey, 10 Crore Profit to Kanchana 3
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs