స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ప్రస్తుతం ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్‌లో ఉన్న ఈ సినిమా నుండి కథకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చింది. త్రివిక్రమ్ తన సినిమాల్లో ఎమోషన్‌ని కాస్త ఎక్కువగానే ఉండేలా చూసుకుంటాడు.
అయితే ఈసారి కూడా బన్నీ సినిమాలో ఎమోషన్నే హైలెట్ చేస్తూ.. బన్నీ కోసం మంచి సిస్టర్ సెంటిమెంట్ కథ రాశాడట. రెగ్యులర్ సినిమాల మాదిరిగా రెండు మూడు సీన్స్ రాసుకుని వాటిని డెప్త్ డైలాగ్‌లతో పడించడం కాకుండా కథ మొత్తం చెల్లి పాత్ర చుట్టూ తిరిగేలా రాసుకున్నాడని టాక్ నడుస్తుంది. అయితే ఇందులో సిస్టర్ పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేది ఇంకా తెలియాల్సిఉంది.
ఇక ఈమూవీలో త్రివిక్రమ్ బన్నీని కాస్త వైవిధ్యంగా చూపించబోతున్నాడని సమాచారం. అందుకే బన్నీ డ్రెస్సింగ్ స్టైల్ దగ్గరనుండి హెయిర్ స్టైల్ వరకు కొత్త బన్నీ కనిపించేలా త్రివిక్రమ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట. బన్నీ సరసన పూజా రెండోసారి నటిస్తుంది. ఇందులో సుశాంత్, నవదీప్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బన్నీ తల్లి పాత్రలో టబు నటిస్తుంది.