Advertisement
Google Ads BL

ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సాహో’ సర్‌ప్రైజ్


‘బాహుబలి’ రెండు పార్టుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. ఇండిపెండెన్స్‌డే కానుకగా ఆగ‌స్ట్ 15న ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయ‌ర్ గా విడుద‌లకి సిద్ధ‌మౌతోంది. రేపటి నుంచి(మే 21) ప్రభాస్ సాహో ప్రమోషన్స్‌ని మొదలు పెట్టనున్నారు. ఇందులో భాగంగా సాహో న్యూ లుక్‌తో ఉన్న రిలీజ్ డేట్ పోస్టర్‌ను ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన వీడియో‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్ పోస్ట్ చేశారు.

Advertisement
CJ Advs

యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్-విక్కీలు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూడు భాషల్లో ఒకేసారి షూట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1తో మంచి క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే.

షేడ్స్ ఆఫ్ సాహో 2తో ఈ చిత్రం హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ బర్త్‌డే కానుకగా విడుదల చేసిన వీడియోకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ స్పెషల్ వీడియోలో శ్రద్దా కపూర్ క్యారెక్టర్ లుక్‌ని రివీల్ చేశారు. ఈ వీడియోలో ప్రభాస్, శ్రద్దా కపూర్ స్టైలిష్ లుక్స్... ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మేకింగ్ హైలైట్‌గా నిలుస్తున్నాయి. ఈ మేకింగ్ వీడియోతో ఈ సినిమా ఏ రేంజ్‌లో తీస్తున్నారు అనేది మరింత స్పష్టమైంది. డినో యురి 18 కెడబ్ల్యూ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా విజువల్స్‌ని క్యాప్చర్ చేయడం మరో విశేషం. ఇంత‌టి భారీ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి ర‌న్‌ రాజా రన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు.

సాహోని ఓ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్‌తో పాటు హాలీవుడ్, బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హైటెక్ యాక్ష‌న్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చిత్రీక‌రిస్తున్నారు. బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ సంగీతమందిస్తున్నారు. హిందీ లిరిక్స్‌ను... స్టార్ రైటర్ అమితాబ్ భట్టాచార్య అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా సాహోలో ప్రభాస్ స్టైలిష్ గా, ఓ కొత్త ఎనర్జీతో కనిపించబోతున్నారు.

బ్యానర్  - యువి క్రియేషన్స్

దర్శకుడు - సుజీత్

నిర్మాతలు - వంశీ-ప్రమోద్-విక్కీ

సంగీతం - శంకర్-ఎహసాన్-లాయ్

సినిమాటోగ్రాఫర్ - మధి

ఆర్ట్ డైరెక్టర్ - సాబు సిరీల్

ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్

పిఆర్వో - ఏలూరు శ్రీను

Prabhas Will Share an Important Message with his Fans:

This is the Prabhas Saaho Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs