Advertisement
Google Ads BL

ఈ ‘సీత’పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు


నిర్మాతల కుమారులలో కేవలం వెంకటేష్‌ మాత్రమే నిలదొక్కుకుని రాణించాడు. ఆ తర్వాత నితిన్‌ ఫర్వాలేదనిపించాడు. ఇక బెల్లంకొండ సురేష్‌ తనయునిగా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన యువ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌. ఈయన ఇప్పటివరకు తన మార్కెట్‌ రేంజ్‌ని మించి టాప్‌ హీరోయిన్లు, భారీ స్టార్‌కాస్ట్‌తో, పెద్ద పెద్ద దర్శకులతో పనిచేశాడు. కానీ ఇవ్వన్నీ కాస్ట్‌ ఫెయిల్యూర్స్‌గా నిలిచాయి. మరోవైపు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. బడా బడా హీరోల చిత్రాలలో కూడా కంటెంట్‌ లేకపోతే నిరభ్యంతరంగా తిరస్కరిస్తున్న ఓవర్‌సీస్‌లో తన ప్రతి చిత్రం విడుదలయ్యేలా చూస్తున్నాడు. కానీ అక్కడ పరిస్థితి కూడా సో..సో.. గానే ఉంటోంది. జయజానకి నాయకా, కవచం వంటి చిత్రాలను కూడా భారీగానే ఓవర్‌సీస్‌లో రిలీజ్‌ చేశారు. 

Advertisement
CJ Advs

తాజాగా ఈనెల 24న విడుదల కానున్న తేజ దర్శకత్వంలో సాయిశ్రీనివాస్‌, కాజల్‌ జోడీ వరుసగా రెండో సారి జత కట్టిన ‘సీత’కు కూడా యూఎస్‌లో ప్రీమియర్లు వేయనున్నారు. ఇక విషయానికి వస్తే సమ్మర్‌ హాలీడేస్‌లో వచ్చిన ఒకే ఒక్క పెద్ద చిత్రం ‘మహర్షి’ సంచనలనాలు సృష్టిస్తుందని పలువురు భావించారు. ఈ చిత్రం కలెక్షన్లు స్టడీగా ఉన్నప్పటికీ మరీ ఊహించిన స్థాయిలో మాత్రం లేదు. ఇక తాజాగా విడుదలైన అల్లుశిరీష్‌ ‘ఎబిసిడి’ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. ‘సీత’ చిత్రం విడుదల నాటికి దానికి భారీగా థియేటర్లు లభించడం ఖాయమనే చెప్పాలి. మరి ఈ అడ్వాంటేజ్‌ని ‘సీత’ ఎంతవరకు ఉపయోగించుకుంటుందో చూడాలి..? ‘నేనే రాజు నేనే మంత్రి’ తర్వాత రెండేళ్ల గ్యాప్‌ తీసుకున్న తేజ తన రూట్‌ని మార్చి రామాయణంలోని పాత్రలను కాస్త అటు ఇటుగా మార్చి ఈ చిత్రాన్ని తీశాడు. 

యూట్యూబ్‌లో కూడా ఈ చిత్రం ట్రైలర్స్‌కి, ప్రొమోస్‌కి మంచి స్పందనే వస్తోంది. అనూప్‌రూబెన్స్‌ అందించిన సంగీతం బాగానే ఆకట్టుకుంటోంది. మరి ఈ చిత్రంలో తేజ, కాజల్‌ ఇమేజ్‌ని ఎలా ఉపయోగించుకున్నాడు? ఎలా ఎంటర్‌టైన్‌ చేయబోతున్నాడు? ఎంత వెరైటీగా దీనిని తీర్చిదిద్దాడు? అనే అంశాలపై ఈ చిత్రం విజయం ఆధారపడి ఉంది. హాలీవుడ్‌ ‘అల్లాద్దీన్‌’ తప్ప మరో పోటీ లేకపోవడం, ఈ చిత్రం వచ్చే సమయానికి ‘మహర్షి, ఎబిసిడి’ రెండు డల్‌ కావడం ఖాయం కాబట్టి దానిని ఈ ‘సీత’ ఎంత వరకు క్యాష్‌ చేసుకుంటుందో వేచిచూడాల్సివుంది...! 

Sita Team Happy with Output:

Sita team full Hopes on Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs