‘ఎన్.జి.కె.’ తెలుగు రైట్స్‌ను సొంతం చేసుకున్న శ్రీసత్యసాయి ఆర్ట్స్ కె.కె.రాధామోహన్ - మే 31 విడుదల
‘గజిని’, ‘సింగం’ చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో సింగం సూర్య, ‘7జి బృందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘ఎన్.జి.కె.(నంద గోపాలకృష్ణ)’. ఈ చిత్రం మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కాగా, ఈ సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత, శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ సొంతం చేసుకున్నారు. మే 31న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సూర్య సరసన సాయిపల్లవి, రకుల్ ప్రీత్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: శివకుమార్ విజయన్, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్, ఆర్ట్: ఆర్.కె.విజయ్ మురుగన్, నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, దర్శకత్వం: శ్రీరాఘవ.