Advertisement
Google Ads BL

‘రెడ్డిగారి అబ్బాయి’కి విజయశాంతి షాక్!


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సక్సెస్ ని ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు. పార్టీలు మీద పార్టీలు చేసుకుంటున్న మహేష్ అప్పుడే తన నెక్స్ట్ మూవీ పనుల్ని కూడా స్టార్ట్ చేసేసారు. మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులు నుండి ఈ సినిమాకు సంబంధించి రెండు వార్తలు వైరల్ అవుతున్నాయి. 

Advertisement
CJ Advs

అందులో ఒకటి ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ విజయశాంతి నటిస్తున్నట్టు తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఈమె తీసుకునే రెమ్యూనరేషన్ షాకింగ్ గా ఉంది. ఈ సీనియర్ నటి ఈ చిత్రంలో నటించేందుకు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారట. రేట్ విని షాక్ తిన్న నిర్మాతలు చేసేది ఏమిలేక ఆమె అడిగినంత ఇచ్చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇంత రెమ్యూనరేషన్ ఈ సినిమాను డైరెక్ట్ చేసే డైరెక్టర్ తీసుకోడు అండ్ ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్స్ కూడా తీసుకోరు. మరి విజయశాంతి ఎందుకు అంత రేట్ చెప్పింది?

అలానే మరో వార్త ఈ సినిమా యొక్క టైటిల్. దీనికి ‘రెడ్డిగారి అబ్బాయి’ అనే టైటిల్ ను పెడితే ఎలా ఉంటుందో అని మేకర్స్ ఆలోచిస్తున్నారట. దాదాపు ఈ టైటిలే కన్‌ఫర్మ్ అయినట్టు సమాచారం. ఇది రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని అందుకే ఈ టైటిల్ అనుకుంటున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు వరకు ఆగాల్సిందే.

Vijayashanti demands a whopping sum for Mahesh 26:

Lady Amitabh Shocks Mahesh Babu  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs