మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పుడు నిర్మాతలు ఈ చిత్రంలో హీరోయిన్‌ను ఖరారు చేశారు. ‘ఉప్పెన’ చిత్రం ద్వారా మంగళూరుకి చెందిన క్రితి శెట్టిని హీరోయిన్‌గా పరిచయం చేయనున్నారు.
సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం మే 25 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటి్ంగ్స్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
నటీనటులు:
పంజా వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, క్రితి శెట్టి తదితరులు
సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సాన
సి.ఇ.ఒ: చెర్రీ
బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
సినిమాటోగ్రఫీ:శ‌్యామ్ దత్ సైనుద్దీన్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్: నవీన్ నూలి
ఆర్ట్: మోనిక రామకృష్ణ